సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రసరించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సిటీ పోలీసులు పబ్లిక్ అడ్వయిజరీ జారీ చేశారు. అర్థరాత్రి సమయంలో మహిళలకు “ఉచిత రైడ్ సర్వీస్” గురించి తప్పుడు దావా ఆన్లైన్లో విస్తృతంగా షేర్ చేయబడిన తర్వాత ఇది జరిగింది. రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల మధ్య ఒంటరిగా ఉన్న మహిళలు హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించడం ద్వారా ఉచిత పోలీసు వాహనంలో ఇంటికి వెళ్లడానికి అభ్యర్థించవచ్చని పేర్కొన్న…
రైతు రుణమాఫీ అసలు వాస్తవాలను ప్రజలకు చూపించేందుకు సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లికి వెళ్లిన మహిళా జర్నలిస్టులు సరితా, విజయారెడ్డిపై సీఎం అనుచరులు దాడి చేయటాన్నిభారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్ట్ లపై దాడి చేయటం హేయమైన చర్య అని మండిపడ్డారు. ఇందిరమ్మ పాలనగా ఫోజులు కొట్టే రేవంత్ రెడ్డి… మీ పాలనలో మహిళా జర్నలిస్టులకే రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ‘ఇద్దరు మహిళ జర్నలిస్ట్…
రెండు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ మొదటగా పోలాండ్ లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో.. ఉక్రెయిన్, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి సమస్యనైనా యుద్ధభూమిలో కాకుండా సంభాషణలు, దౌత్యం ద్వారా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. ఉక్రెయిన్ మరియు పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు మనందరికీ తీవ్ర ఆందోళన కలిగించే విషయమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. యుద్ధభూమిలో ఏ సమస్యకూ పరిష్కారం లభించదని భారత్ దృఢంగా విశ్వసిస్తోందని మోడీ చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి నిజస్వరూపం బయట పడిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు గుప్పించారు. జనగామకు వచ్చి కొమురవెల్లి మల్లన్న మీద ఓట్టు వేసి ఆగస్టు 15 వరకు రైతులకు రుణమాఫీ చేస్తా అన్నాడని, ఏ ఊర్లో నైనా వంద శాతం రుణమాఫీ అయ్యిందా అని ఆయన ప్రశ్నించారు. ఇంకా 22 లక్షల మందికి రుణమాఫీ కాలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ మంత్రులే రుణమాఫీ మొత్తం కాలేదని ఒప్పుకున్నారని హరీష్ రావు గుర్తు చేశారు. తెలంగాణ…
నోయిడాలో ఓ షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. సెక్టార్ 94లో ఉన్న పోస్ట్‌మార్టం హౌస్‌లో అశ్లీల వీడియో బయటపడింది. ఓ ఉద్యోగి ఒక మహిళతో లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. అంతేగాక.. ఆ నీచ పనిని మరో వ్యక్తి వీడియో తీస్తున్నాడు. కాగా.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. స్వీపర్‌ని ఉద్యోగం నుంచి తొలగించారు.
చేవెళ్ల రైతు నిరసన దీక్ష కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సచివాలయంలో లంకె బిందెలు ఉంటాయనుకున్నా కానీ అవి లేనే లేవు. ఎట్ల రుణమాఫీ చేయలే అన్నట్లుగా మాట మార్చాడన్నారు. కొత్తగా వచ్చాడు కదా ఆయనకు కొంత టైమ్ ఇద్దామని మేము కూడా ఎదురుచూశామని, ఇదే రేవంత్ రెడ్డి బ్యాంకర్లతో సమావేశం పెట్టాడు. 2 లక్షల రుణం మాఫీ కోసం రూ. 49 వేల కోట్లు కావాలని బ్యాంకర్లు…
ఎడ్యుకేషన్, ఇరిగేషన్ మా ప్రయారిటీ అని నెహ్రు పరిపాలన సాగించారని, బ్యాంకులను రైతుల కోసం జాతీయం చేశారు ఇందిరాగాంధీ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పేదలకు భూములు ఇచ్చి ఆత్మగౌరవం పెంచారు ఇందిరాగాంధీ అని, సాంకేతిక రంగాన్ని పెంచి పోషించారు రాజీవ్ గాంధీ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సాంకేతిక విప్లవం తెచ్చారు రాజీవ్ గాంధీ అని, పీవీ లాంటి ప్రధానులు దేశం కోసం ప్రణాళికలు రచించి దేశాన్ని ముందుకు నడిపించారన్నారు. స్వతంత్ర పోరాటం కోసం గుజరాత్…
యువతలో గుండెపోటు కేసులు అధికమవుతున్నాయి. రోజుకు ఎక్కడో చోట హార్ట్ ఎటాక్ తో బలవుతున్నారు. తాజాగా.. గుజరాత్ లోని జామ్‌నగర్‌కు చెందిన 19 ఏళ్ల ఎంబీబీఎస్ విద్యార్థి జిమ్‌లో వ్యాయామం చేస్తూ గుండెపోటుతో మృతి చెందాడు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇక్కడ కూడా జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా గుండె ఆగిపోయింది. గుండెపోటు రావడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
ఆ మాజీ ఐఎఎస్ పొలిటికల్ ప్లస్సా? మైనస్సా? సింపుల్‌గా, షార్ట్‌కట్‌లో వీలైతే ఎమ్మెల్యే... కుదిరితే మంత్రి కూడా అయిపోయి దర్పం ఒలకబోయాలనుకున్న ఆయన ముంత ఆదిలోనే ఒలికిపోయింది. అటు ఉద్యోగమూ పాయె... ఇటు పదవీ రాకపోయె. ఇప్పుడా అధికారి ఫుల్‌టైం పొలిటీషియన్ అవుతారా? ఆ నియోజకవర్గంలో వైసీపీని నిలబెట్టే సత్తా ఉందా? జీతపు రాళ్ళకు అలవాటు పడ్డ బాబు... జేబులో నుంచి డబ్బు తీసి కేడర్ కోసం ఖర్చు పెట్టగలరా? ఇంతకీ ఎవరాయన? ఏంటా కథ?