Nadendla Manohar: గ్రామాల అభివృద్ధే గ్రామసభల ముఖ్య ఉద్దేశం
- గుంటూరు జిల్లా వల్లభాపురంలో గ్రామ సభలో పాల్గొన్న మంత్రి మనోహర్
- పంచాయితీ వ్యవస్థని బలోపేతం చేసుకునే విధంగా గ్రామ సభలు జరగాలని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nadendla Manohar: అవినీతి లేకుండా పంచాయితీ వ్యవస్థని బలోపేతం చేసుకునే విధంగా గ్రామ సభలు జరగాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం వల్లభాపురంలో గ్రామ సభలో పాల్గొన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. గ్రామ సభలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలు స్వీకరించి , వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సోషల్ ఆడిట్ సక్రమంగా నిర్వహించలేదంటూ అధికారులపై మంత్రి మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మెరుగుపరుచుకోకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తూతూ మంత్రంగా కార్యక్రమాలు చేయవద్దంటూ అధికారులపై మండిపడ్డారు. తాగునీరు, పెన్షన్, ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం,మందుల సమస్యలు,మురుగు నీటి సమస్యలను మంత్రి మనోహర్ దృష్టికి గ్రామస్థులు తీసుకువచ్చారు.
Read Also: Pawan Kalyan: వరద ప్రభావిత గ్రామాలను అన్ని విధాలా ఆదుకుంటాం..
Also Read
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
- Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
గతంలో స్పీకర్‌గా ఉన్న తాను కోట్లాది రూపాయలతో తెనాలి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టానని మంత్రి వెల్లడించారు. గ్రామాల అభివృద్దే గ్రామ సభల ముఖ్య ఉద్దేశమన్నారు. మూడు నెలల్లోనే నిధులు తీసుకువచ్చి గ్రామాల అభివృద్ధి పనులు చేపడతామన్నారు. గత ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని కూడా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. గత ప్రభుత్వంలో నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. నిజాయితీగా పని చెయ్యని అధికారులపై క్రిమినల్ కేసులు పెడతామన్నారు. రైతులు ఎవ్వరు అధైర్యపడొద్దని.. యూరియా కంపెనీలలో తనిఖీలు చేస్తున్నామన్నారు. ఎక్కడా ఎరువుల కొరత లేకుండా రైతులకు అందుబాటులో ఉంచుతామని మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!