CM Chandrababu: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్ .. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు
- ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు శుభవార్త
- వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేస్తామని ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేస్తామని.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపల్లి మండలం వానపల్లిలో గ్రామసభలో పాల్గొని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో 17500కిలో మీటర్లు సీసీ రోడ్లు వేస్తామన్నారు. మట్టి అంటకుండా బయటకు వెళ్లేలా చేస్తామన్నారు. 10వేల కిలోమీటర్లు మురికి కాల్వలు నిర్మిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఒక పద్ధతి ప్రకారం అభివృద్ది పనులు గ్రామాల్లో చేపడతామన్నారు. రీ సైక్లింగ్‌తో చెత్త ద్వారా సంపద క్రియేట్ చేస్తున్నామని చెప్పారు.
ప్రతి కుటుంబానికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల భూమి ఇళ్ల స్థలంగా ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికీ ఇళ్లు కట్టించే భాధ్యత తీసుకుంటున్నామని.. గత ఐదేళ్లుగా రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయని మండిపడ్డారు. గత నాయకుడు ఏనాడైనా గ్రామ సభ పెట్టాడా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. జనంలోకి రావాలంటే పరదాలు,, చెట్లు నరికి వేయడం.. ఇదేమీ దారుణమంటూ విమర్శించారు. నరేగాలో ఎంతమందికి పని కావాల్సిన కల్పిస్తామన్నారు. రూ.4,550 కోట్లతో గ్రామీణ అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. 2019- 24 చీకటి రాజ్యం నడిచిందని.. నరేగ నిధులు దొంగ బిల్లులతో దోచుకున్నారని ఆరోపించారు.
Also Read
- West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
- Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
- South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
- Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
Read Also: Jogi Rajeev: జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్‌కు ఏసీబీ కోర్టు బెయిల్
గ్రామానికి ప్రథమ పౌరుడు సర్పంచ్ అని.. 97శాతం గెలిపించి బ్రహ్మరథం పట్టారన్నారు. రాష్ట్రంలో 990 కోట్లు పంచాయతీలకు విడుదల చేశామని.. మరికొన్ని నిధులు జారీ చేయనున్నామని తెలిపారు. నిర్ధిష్టమైన కార్యక్రమాల్లో ముందుకు వెళతామన్నారు. ల్యాండ్ టైటాలింగ్ యాక్ట్ రద్దు చేశామని చెప్పారు. పెన్షన్ల పంపిణీ సాధ్యం కాదన్నారు.. కానీ 4వేలకు పెంచి అందరికీ అందించామన్నారు. అక్టోబర్ నెలఖారు పూర్తిస్థాయిలో అన్న క్యాంటీన్ ప్రారంభిస్తామని సీఎం చెప్పారు.నైపుణ్యం లేక యువతకు ఉపాధి, ఉద్యోగాల కొరత ఏర్పడిందన్నారు. వ్యవసాయంలో పెట్టుబడి తగ్గించే ఆలోచన చేస్తున్నామన్నారుఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.రిజిస్ట్రేషన్ ద్వారా ఇంటికి పంపణీ ఏర్పాటు చేస్తామన్నారు. వీలైనంత త్వరలో పోలవరం ప్రాజెక్ట్‌ని పూర్తి చేసి రైతులకు నీరు అందిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. 1674 కోట్ల రూపాయలు రైతుల ధాన్యం బిల్లులు చెల్లించామని సీఎం పేర్కొన్నారు.
తాజావార్తలు
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!