CM Revanth Reddy : కేంద్రమంత్రి జోతిరాదిత్య సింధియాతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి భేటీ అయ్యారు. టీ-ఫైబర్ ప్రాజెక్ట్‌ను భారత్ నెట్ ఫేజ్-3గా మార్చేందుకు ఇచ్చిన డీపీఆర్‌ను ఆమోదించాలని కేంద్రమంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. భారత్ నెట్ ఉద్యమి ప్రోత్సాహక పథకాన్ని టీ-ఫైబర్‌కు వర్తింపజేయాలని విన్నవించారు. టీ-ఫైబర్‌కు రూ.1,779 కోట్ల వడ్డీలేని రుణాన్ని ఇవ్వాలని సింధియాను సీఎం రేవంత్ కేంద్రమంత్రిని కోరారు. టీ – ఫైబర్ లక్ష్యం ఆప్టికల్ ఫైబర్ ద్వారా అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు నెట్‌వర్క్ కల్పించడం. టీ-ఫైబర్ యొక్క ప్రధాన ఉద్ధేశం 65,000 ప్రభుత్వ సంస్థలకు జీ2జీ, జీ2సీ సేవలు అందించడం. గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల గృహాలకు, పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల గృహాలకు నెలకు కేవలం రూ. 300 కే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ-ఎడ్యుకేషన్ సేవలు అందించడం లక్ష్యం. టీ-ఫైబర్ అమలుకు గానూ జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ (ఎన్ఎఫ్ఓఎన్) మొదటి దశ మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వానికి త్వరగా అందించాలని కేంద్ర మంత్రి సింధియాకు విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎన్ఎఫ్ఓఎన్ మొదటి దశ నుంచి భారత్ నెట్ మూడో దశకు మార్చడానికి పంపించిన డీపీఆర్ ను ఆమోదించాలని కేంద్ర మంత్రి సింధియాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.
UP: యూపీలో దారుణం.. మేనకోడలు మరొకర్ని పెళ్లి చేసుకుంటుందని హత్య
Also Read
తాజావార్తలు
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!