గోవాలోని ఓ ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు టీచర్లు పైశాచికానికి పాల్పడ్డారు. 9 ఏళ్ల విద్యార్థిని చితకబాదారు. ఈ ఘటన అందరినీ కలిచివేసింది. ఈ క్రమంలో.. చిన్నారిని దారుణంగా కొట్టిన ఇద్దరు ఉపాధ్యాయులు సుజల్ గావ్డే, కనీషా గడేకర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నారి తన పుస్తకంలోని పేజీలను చింపివేయడంతో కోపాద్రిక్తులైన టీచర్లు.. విద్యార్థిని దారుణంగా చితకబాదారు.
సిక్కింలోని పాక్యోంగ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ వాహనం లోతైన లోయలో పడటంతో నలుగురు సైనికులు వీరమరణం పొందారు. ఆర్మీ వాహనం కఠినమైన పర్వత మార్గంలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పశ్చిమ బెంగాల్లోని పెడాంగ్ నుంచి సిక్కింలోని జులుక్కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ గ్రౌండ్లో 8 ట్రాక్లతో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ శంకుస్థాపన చేశారు. ఒలంపిక్ స్థాయిలో శిక్షణ ఇచ్చిన ఘనత నిజామాబాద్కు ఉందని షబ్బీర్ అలీ పేర్కొన్నారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య గత రెండున్నరేళ్లుగా యుద్ధం కొనసాగుతోంది. శత్రు దేశానికి గరిష్ఠంగా నష్టం వాటిల్లేలా ఈ యుద్ధంలో ఇరుపక్షాలూ వివిధ రకాల ఆయుధాలు, రసాయనాలు వాడుతున్నాయి. ఈ క్రమంలో.. ఉక్రెయిన్ ఈ మధ్య కాలంలో రష్యాపై అనేకమైన దాడులు చేసింది. అందులో కొత్త రకం దాడి కూడా కనిపించింది. ఉక్రెయిన్ డ్రోన్లను ఉపయోగించి రష్యన్ ప్రాంతాలలో కరిగిన థర్మైట్ను స్ప్రే చేసింది. ఉక్రేనియన్ డ్రోన్లు రష్యాలో మండే పదార్థాలను స్ప్రే చేస్తున్నట్టు సోషల్ మీడియాలో ఓ వీడియో…
వారం రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు సింగూరులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో సింగూరు ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యానికి నీటిమట్టం చేరుకోవడంతో గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరితో కలిసి ప్రాజెక్టు వద్ద గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం 2025.. ఆగస్ట్ 20 నుంచి ప్రారంభమైందని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. రాబోయే నాలుగు నెలలు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు.
భారీ వర్షాలకు తెగిపోయిన చెరువుకట్టలు, కెనాల్స్ పునరుద్ధరణకు వారం రోజుల్లో టెండర్లు పిలవాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖాధికారులను ఆదేశించారు. చెరువులు, కాలువల పునరుద్ధరణతో పాటు పాక్షికంగా దెబ్బతిన్న చెరువులు, కాలువల మరమ్మతులకు కూడా టెండర్ల ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలన్నారు.
ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న అనేక వ్యాధుల మధ్య.. మీరు ఆరోగ్యంగా ఉండటం ఒక వరం. అయితే మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా? దీనికి ఏదైనా పరీక్ష ఉందా?.. వ్యాధుల విషయంలో కొన్ని రకాల పరీక్షల ద్వారా సమస్యలను గుర్తించవచ్చు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులలో రక్త పరీక్ష.. కడుపు సమస్యలలో అల్ట్రాసౌండ్ తో గుర్తిస్తారు. అయితే మనం ఆరోగ్యంగా ఉన్నారా లేదా అని తెలుసుకోవడం ఎలా..?
గణేష్ నిమజ్జన ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు జరగరాదని, అవసరమైన అన్ని వసతులను ఏర్పాటు చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డితో కలిసి ఎల్బీ నగర్ జోన్లో పర్యటించి గణేష్ నిమజ్జనానికి చెరువులు, బేబీ పాండ్స్ సంసిద్ధత, ఏర్పాట్లను పరిశీలించారు.
సైన్యంలో చేరేందుకు సిద్ధమవుతున్న అగ్నివీర్కు కేంద్ర ప్రభుత్వం త్వరలో భారీ కానుక ఇవ్వనుంది. 4 సంవత్సరాల వ్యవధి తర్వాత.. సైన్యంలో అగ్నివీరులను కొనసాగించే పరిమితిని పెంచవచ్చని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం.. అగ్నివీర్లో 25 శాతం మంది పని చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన వెల్లడి కాలేదు.