AP Weather: ఉత్తర, దానిని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం ఈరోజు ఉదయం తీవ్ర అల్పపీడనంగా ఏర్పడింది. . ఇది నెమ్మదిగా ఉత్తర దిశగా కదులుతూ వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్,గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ తీరాల్లో సెప్టెంబర్ 9న వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దీనిప్రభావంతో శనివారం ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, ఆది, సోమవారాల్లో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
Read Also: Budameru: ఆపరేషన్ బుడమేరు సక్సెస్.. మూడో గండిని పూడ్చివేసిన అధికారులు
మూడు రోజుల పాటు కోస్తాలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. ఆదివారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఉభయ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.