దొంగిలించిన మద్యం పంపకం విషయంలో వాగ్వాదం చోటుచేసుకోవడంతో స్నేహితుడినే దారుణంగా హత్య చేసిన ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం గోపాల్‌పూర్‌లో జరిగింది. ఈ కేసు వివరాలను తాండూర్ డీఎస్పీ బాలకృష్ణా రెడ్డి వెల్లడించారు.
శరీరం ఫిట్, స్లిమ్‌గా ఉండేందుకు చాలా మంది జిమ్‌కి వెళ్తుంటారు. అయితే.. జిమ్‌లో జిమ్ చేసేముందు ఒక తప్పిదం చేస్తున్నారు. దీంతో.. మనుషులు గుండెపోటుకు గురవుతున్నారు. అయితే.. జిమ్ చేసే ముందు అనేక గుండె సంబంధిత పరీక్షలు చేసుకోవాలని జిమ్ ట్రైనర్లు చెబుతుంటారు. కానీ.. చాలా తక్కువ మంది మాత్రమే ఈ పరీక్షలన్నీ చేయించుకుంటున్నారు.
పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాల నేపథ్యంలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ దాదాపు నిండుకుండల్లా మారిపోయాయి. శ్రీశైలం, నాగార్జున జలాశయాలు పూర్తిగా నిండిపోగా.. గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు.
విద్యార్థులే మా ప్రజా ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. వారి సమస్యలు పరిష్కరించేలా అంతా కృషి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్, గురుకుల సంస్థల్లో, విద్యాబోధన మౌలిక వసతులు, భోజన వసతి, తదితర అంశాలపై మంత్రి సీతక్క సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం విద్యా శాఖ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన రవీంద్ర భారతిలో గురు పూజోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు.