రేపు నల్గొండ జిల్లాలో మంత్రులు పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రులు ఎస్ఎల్బీసీ సొరంగం పనులు పరిశీలించనున్నారు. అమెరికాలోని రాబిన్ సన్ సంస్థ నూతన టెక్నాలజీని వాడాలని ప్రభుత్వం నిర్ణయింది. ఈ నేపథ్యంలో రెండు సంవత్సరాల్లో SLBC పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఖర్చుకు వెనుకాడేది లేదని మంత్రి…
ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందు.. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కొత్తగా ఎన్నికకానున్న ముఖ్యమంత్రికి పని అప్పగించారు. అపరిశుభ్రతకు సంబంధించి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. దీనిపై దృష్టి పెట్టాలని కోరారు. పశ్చిమ ఢిల్లీలో లక్షలాది మంది ప్రజలు నరకం కంటే హీనమైన జీవితాన్ని గడపాల్సి వస్తోందని ఎల్జీ పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరంలోని బహదూర్‌పురా కిషన్‌బాగ్‌లోని ఓ ఇంట్లో బుధవారం మధ్యాహ్నం జరిగిన భారీ పేలుడులో ముగ్గురు తీవ్రంగా సహా కనీసం ఏడుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కిషన్‌బాగ్‌లోని జనసాంద్రత ఎక్కువగా ఉండే అసద్‌బాబా నగర్ ప్రాంతంలో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించింది. పేలుడు ప్రభావం కారణంగా, ఆస్బెస్టాస్ పైకప్పు ఉన్న ఇల్లు బాగా దెబ్బతింది , ఆ ప్రాంతంలో ష్రాప్నల్ ఎగిరి పొరుగు భవనాల గాజు ముఖభాగాన్ని…
జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వనకు పుట్టిస్తున్నారు రెవెన్యూ, హైడ్రా అధికారులు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వ భూములను రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ఎకరాల కొలది భూములను చెరపట్టారు. భూకబ్జాదారుల నుంచి భూములను విముక్తి కల్పించడానికి కాప్రా రెవెన్యూ అధికారులు దూకుడు మొదలుపెట్టారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శాంతి కోటేష్ గౌడులకు ఐదు ఎకరాల భూమిపై నోటీసులు జారీచేసిన రెవెన్యూ అధికారులు. డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి…
2050 నర్సింగ్ ఆఫీసర్స్ (స్టాఫ్ నర్స్) ల భర్తీకి జనరల్ రిక్రూట్మెంట్ కు రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ లో భాగంగా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) ల నియామకంలో భాగంగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ & డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లలో 1576 పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో 332 నర్సింగ్…
మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో 21 ఏళ్ల చిలుకకు ఆపరేషన్ చేసి తన ప్రాణాలను కాపాడిన ప్రత్యేక కేసు వెలుగులోకి వచ్చింది. సమాచారం ప్రకారం.. చిలుక మెడలో కణితి ఉందని, దాని వల్ల చిలుక ప్రాణాలకు ప్రమాదం ఉంది. ఈ క్రమంలో.. పశు వైద్యులు శస్త్రచికిత్స చేసి దాని మెడలోంచి 20 గ్రాముల కణితిని తొలగించి ప్రాణాలను కాపాడారు.
ఇటీవల ప్రభుత్వం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా నియమితులైన భారత బాక్సర్ నిఖత్ జరీన్ బుధవారం ఇక్కడ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్‌కు రిపోర్ట్ చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో నిఖత్ జరీన్‌ను డీఎస్పీ పోస్ట్‌లో నియమించినట్లు డీజీపీ ప్రకటించారు. “రెండుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్, ఒలింపిక్ అథ్లెట్ అయిన నిఖత్ జరీన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (స్పెషల్ పోలీస్)గా తన కొత్త పాత్రను స్వీకరించినందుకు మేము గర్వంగా స్వాగతిస్తున్నాము. నిజామాబాద్‌కు…
సీమాంచల్ ఎక్స్‌ప్రెస్‌లోని 2వ ఏసీ కోచ్‌లో టికెట్ లేకుండా ఓ మహిళ ప్రయాణిస్తుంది. ఆమె ఢిల్లీ నుంచి బీహార్‌కు వెళ్తుంది. న్యాయవాది అని చెప్పుకుంటున్న మహిళ టికెట్ లేకుండా రైలులోని సెకండ్ ఏసీలో ప్రయాణిస్తోంది. ఇంతలో టీటీఈ వచ్చి టికెట్ అడగ్గా ట్రైన్లో తీవ్ర గందరగోళం సృష్టించింది. తన పేరు చెప్పమని అడగ్గా.. చెప్పేందుకు నిరాకరించింది. టీటీఈతో పాటు తోటి ప్రయాణికులతో తీవ్ర వాగ్వాదానికి దిగింది.
భద్రాద్రి ఆలయం పేరును దుర్వినియోగం చేస్తున్నారని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆరోపిస్తూ అమెరికాలోని రామమందిరంపై దేవస్థానం అధికారులు వివాదంలో చిక్కుకున్నారు. అమెరికాకు చెందిన ఓ సంస్థ భద్రాద్రి దేవాలయం పేరును ఉపయోగించి విరాళాలు సేకరిస్తున్న నేపథ్యంలో ఆలయ పేరు దుర్వినియోగం కాకుండా న్యాయపోరాటం చేసేందుకు అధికారులు యోచిస్తున్నారు. ఆలయం పేరుకు పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకునే యోచనలో ఆలయ అధికారులు ఉన్నట్లు సమాచారం. కానీ న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, పేటెంట్ చట్టాలు పేరు లేదా…
కరివేపాకును వంటలలో రుచి కోసం తరుచుగా ఉపయోగిస్తాం. అయితే.. ఇది రుచికే కాకుండా.. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కరివేపాకులో చాలా ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఇది శరీరం యొక్క మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కరివేపాకును రెగ్యులర్‌గా తినడం వల్ల శరీరంలోని అనేక భాగాలను బలంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.