Home
Telugu News
Telugu News News
-
BRS : తెలంగాణలో ప్రజారోగ్య స్థితిని అధ్యయనం చేయడానికి బీఆర్ఎస్ ప్యానెల్
రాష్ట్రంలో ప్రజారోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు కొత్తగా ఏర్పాటైన త్రిసభ్య కమిటీతో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కీలక సమావేశం నిర్వహించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి టి రాజయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కమిటీలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే మెటుకు ఆనంద్ ఉన్నారు. తెలంగాణలో క్షీణిస్తున్న ఆరోగ్య వ్యవస్థను అధ్యయనం చేయడానికి , ప్రభుత్వానికి సహాయం చేయడానికి ఈ బృందం ఏర్పడింది , ఈ రోజు తన కార్యకలాపాలను ప్రారంభించింది.… -
Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ టైటిల్ గెలుచుకున్న ఇండియా ‘A’..
దులీప్ ట్రోఫీ 2024 టైటిల్‌ను ఇండియా 'A' కైవసం చేసుకుంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఇండియా ఏ రెండింట్లో విజయం సాధించగా.. ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. రెండు విజయాలతో ఈ జట్టు గరిష్టంగా 12 పాయింట్లను కలిగి ఉంది. దీంతో.. జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. భారత్ సి 9 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. కాగా.. భారత్ ఎ జట్టు 61వ సారి దులీప్ ట్రోఫీ టైటిల్ గెలుచుకుంది. -
HYDRA : చీకట్లో కూడా ఆగని హైడ్రా కూల్చివేతలు..
అమీన్ పూర్లో చీకట్లో కూడా ఆగకుండా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కృష్ణారెడిపేటలో లైట్ల వెలుతురులో అక్రమ నిర్మాణాలను బాహుబలి మిషన్ కూల్చివేస్తోంది. అక్రమ నిర్మాణాన్ని ఆనుకుని ప్రక్కనే మరొక అపార్ట్మెంట్ ఉంది. అయితే.. ఆ అపార్ట్మెంట్ కు ఇబ్బంది కలుగకుండా కూల్చే ప్రయత్నం చేస్తున్నారు హైడ్రా అధికారులు.. పూర్తి నిర్మాణాలు కూల్చే వరకు హైడ్రా యాక్టివిటీ కొనసాగనున్నట్లు అధికారులు చెబుతున్నారు. పటేల్ గుడా లో చివరి దశ… -
Balineni Srinivas Reddy: ఈనెల 26న పవన్ సమక్షంలో జనసేనలోకి బాలినేని..
ఈనెల 26న పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరుతున్నట్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని సన్నిహితులతో మాట్లాడి అందరం కలసి వెళ్తామన్నారు. గతంలోనే పలు సందర్భాల్లో మంచి వ్యక్తి అంటూ తన గురించి పవన్ మాట్లాడారన్నారు. -
Tragedy: విహారయాత్రలో విషాదం.. వాటర్‌ఫాల్స్‌లో ఐదుగురు మెడికల్ విద్యార్థులు గల్లంతు
అల్లూరి జిల్లా మారేడుమిల్లి విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. మారేడుమిల్లి మండలం జలతరంగణి వాటర్ ఫాల్స్ వద్ద ఏలూరు ఆశ్రమ మెడికల్ కాలేజీకి చెందిన ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. -
Minister Nadendla Manohar: ఎన్నికల హామీలన్నీ కచ్చితంగా నెరవేరుస్తాం..
కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలన చాలా బాగుందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో మాట్లాడుతూ.. ప్రజలు ఏం కోరుకున్నారో అలాంటి పాలన అందించగలిగామన్నారు. -
Terrorist : హైదరాబాద్ పాతబస్తీలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్
ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) నేడు హైదరాబాదులో తనిఖీలు చేపట్టింది. సైదాబాద్ ప్రాంతంలోని శంఖేశ్వర్ బజార్ గ్రీన్ వ్యూ అపార్ట్ మెంట్ లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎన్ఐఏ తనిఖీలు దాదాపు గంటసేపు కొనసాగాయి. ఎన్ఐఏ ఆగస్టులో ఉగ్రవాది రిజ్వాన్ అబ్దుల్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రిజ్వాన్ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ తో సంబంధం ఉన్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అని ఎన్ఐఏ గుర్తించింది. రిజ్వాన్ అబ్దుల్ ఐసిస్ తరఫున పుణే… -
Top Headlines @5PM : టాప్ న్యూస్
అధ్యక్ష తరహా పాలన కోసమే ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక.. విజయవాడలో నిర్వహిస్తున్న కామ్రేడ్ ఏచూరి సీతారం సంతాప సభలో ఎంఏ బేబీ, బీవీ రాఘవులు, రామకృష్ణ, మాజీమంత్రి అంబటి రాంబాబు, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మాట్లాడుతూ.. ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది ఖర్చులు తగ్గడం కోసమట.. ప్రజాస్వామ్యం పోయినా పర్లేదా అని ప్రశ్నించారు. ఖర్చు కోసం ప్రాణాలు… -
Hyderabad Rains : హైదరాబాద్‌కు మరోసారి భారీ వర్ష సూచన
హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉప్పల్, నాగోల్, బండ్లగూడ, ఎల్బీ నగర్, సరూర్‌నగర్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. సైదాబాద్, దిల్సుఖ్నగర్, రామంతాపూర్, అంబర్పేట్, మీర్పేట్, గుర్రంగూడ, వనస్థలిపురంలోనూ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే.. రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని , భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్… -
RK Roja: రాజకీయ లబ్ధి కోసం శ్రీవారిని కూడా వదలడం లేదు.. రోజా కీలక వ్యాఖ్యలు
చంద్రబాబు 100 రోజుల పాలనలో జరిగిన అఘాయిత్యాలను కప్పి పుచ్చేందుకు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి రోజా వ్యాఖ్యానించారు. వరదలు, మహిళలపై వరుసగా జరుగుతున్న దాడులు, వైసీపీ నాయకులపై దాడులు, ఇచ్చిన హామీలు చంద్రబాబు నెరవేర్చలేకపోయాడని విమర్శించారు. ఇన్ని తప్పులు చేసిన చంద్రబాబు ప్రజల దృష్టి మళ్లించే విధంగా లడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చారన్నారు.
తాజావార్తలు
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!