సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. దసరా పండుగకు ముందుగానే సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే లాభాల్లో వాటా కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. కర్ణాటక రాష్ట్రంలోని ఆలయాల్లో ప్రసాదాల తయారీకి నందిని నెయ్యిని మాత్రమే వినియోగించాలని కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
అప్పుడు యువగళం… ఇప్పుడు దండయాత్ర..! అప్పుడు యువగళం… ఇప్పుడు దండయాత్ర.. అని వ్యాఖ్యానించారు మంత్రి నారా లోకేష్.. యువగళం 100 కిలో మీటర్లు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన తొలి హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే గ్రామప్రజల ఆనందోత్సాహాల నడుమ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో కిడ్నీ డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించడం సహా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. యువగళం పాదయాత్ర సందర్భంగా జిల్లా ప్రజలు తనపై…
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడులో 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. చాలా మంది ముఖ్యమంత్రులను చూశానని. 2019, 2024 మధ్య పనిచేసిన ముఖ్యమంత్రి లాంటి వ్యక్తిని చూడలేదు.. చూడబోనని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
బీసీ కులగణననతో పాటు.విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని.. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఛలో కలెక్టరేట్ పిలుపులో భాగంగా విద్యార్థులతో కలిసి హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయాన్ని ఆర్.కృష్ణయ్య.పలువురు బీసీ సంఘాలతో కలిసి ముట్టడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్న ఇంతవరకు కులగణన చేయడం లేదని.ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం బిసి ల రిజర్వేషన్లు 42 శాతం కు పెంచడం లేదని కృష్ణయ్య ఆరోపించారు.…
బంగ్లాదేశ్‌తో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన పేరు మీద రికార్డు రాసిపెట్టుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 400 వికెట్లు పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన భారత్ తరఫున 10వ బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. అంతే కాకుండా.. అంతర్జాతీయ క్రికెట్లో 400 వికెట్లు పూర్తి చేసిన ఘనత సాధించిన ఆరో భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రా.
రాష్ట్ర ప్రభుత్వంతో సమావేశాలకు, వేడుకలకు రాష్ట్ర అతిథుల హోదాలో వచ్చే ప్రముఖులు, ప్రతినిధులను గౌరవించి, సత్కరిస్తారు. అదే విధంగా మన రాష్ట్రం తరఫున ఇతర రాష్ట్రాలకుగానీ, దేశ రాజధానికిగానీ వెళ్ళినప్పుడు మర్యాదపూర్వకంగా జ్ఞాపికలు ప్రదానం చేస్తారు. అలా అతిథులకు రాష్ట్ర హస్త కళాకారులు రూపొందించిన కళాకృతులు, కలంకారీ వస్త్రాలు ఇచ్చి సత్కరించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్ణయించారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ఇకపై బస్ టిక్కెట్లకు క్యూఆర్ కోడ్ చెల్లింపులను ఆమోదించనున్నట్లు ప్రకటించింది. ఈ చర్య ప్రయాణీకుల సౌకర్యాన్ని మెరుగుపరచడం , చెల్లింపు ప్రక్రియను క్రమబద్ధీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. నివేదికల ప్రకారం, PhonePe, Google Pay , క్రెడిట్ , డెబిట్ కార్డ్‌లతో సహా వివిధ డిజిటల్ చెల్లింపు పద్ధతులను అనుమతించే వ్యవస్థను అమలు చేయాలని TSRTC మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశించారు. ప్రయాణీకులు వారి మొబైల్ పరికరాల నుండి నేరుగా చెల్లింపులు…
కరోనా వైరస్ కొత్త వేరియంట్ XEC కలవరపెడుతోంది. యూరోపియన్ దేశాలలో ఈ వైరస్ ఇన్ఫెక్షన్ కేసుల పెరుగుదల అధికంగా నమోదవుతోంది. పలు దేశాల్లో కరోనావైరస్ కొత్త వేరియంట్ XEC కేసులు వేగంగా పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. త్వరలోనే ఇది ఆధిపత్య మహమ్మారిగా రూపాంతరం చెందే అవకాశం ఉందని నిపుణులు వెల్లడించారు.
శ్రీవారి లడ్డూ వివాదంపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. లడ్డూ తయారీ చేసే నెయ్యిలో కొవ్వు అనేది ఓ కట్టు కథ అని ఆయన పేర్కొన్నారు. ఇంత దుర్మార్గమైన పని ఎవరైనా చేయగలరా అని ప్రశ్నించారు. దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకునే దుర్మార్గమైన మనస్తత్వం చంద్రబాబుది అంటూ తీవ్రంగా విమర్శించారు.