Tirumala Laddu: ఏఆర్ డెయిరీకి టీటీడీ షాక్.. నెయ్యి వ్యవహారంలో పోలీసులకు ఫిర్యాదు
- నెయ్యి వ్యవహారంపై ఏఆర్ డెయిరీపై టీటీడీ పోలీసులకు ఫిర్యాదు
- ఫిర్యాదు చేసిన టీటీడి మార్కెటింగ్ విభాగం ప్రొక్యూర్‌మెంట్ జీఎం మురళీకృష్ణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Laddu: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో సప్లై చేసిన ఏఆర్ డెయిరీపై టీటీడీ చర్యలకు ఉపక్రమించింది. టీటీడీ నిబంధనలను ఉల్లంఘించి నెయ్యి సప్లై చేసినందుకు ఏఆర్ డెయిరీపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన టీటీడి మార్కెటింగ్ విభాగం ప్రొక్యూర్‌మెంట్ జీఎం మురళీకృష్ణ తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.10 లక్షల కేజీల నెయ్యి సప్లైకీ ఏఆర్ డెయిరీకీ ఈ ఏడాది మే 15వ తేదీన సప్లై ఆర్డర్స్ ఇచ్చామని.. జూన్ 12, 20, 25వ తేదీతో పాటు జూలై 6వ తేదీన 4 ట్యాంకర్ల నెయ్యిని ఏఆర్ డెయిరీ సప్లై చేసిందని ఆయన వెల్లడించారు.
Read Also: CM Chandrababu: వరద సాయంపై సీఎం సమీక్ష.. డెడ్‌లైన్ విధింపు..
Also Read
- layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
ఆడల్ట్రేషన్ టెస్టింగ్ లేకుండా.. గతంలో వున్న పాత విధానాల టెస్టింగ్‌ని నిర్వహించి..ఈ నెయ్యిని టీటీడీ వినియోగించిందన్నారు. లడ్డు నాణ్యత పై భక్తుల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో NDBL సహకారంతో ఆడల్ట్రేషన్ టెస్టింగ్ నిర్వహించాలని టీటీడీ నిర్ణయించిందన్నారు. జులై 6,12 వ తేదీల్లో ఏఆర్ డెయిరీ సప్లై చేసిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిలోని నెయ్యిని టెస్టింగ్ కోసం NDBL ల్యాబ్ కు పంపామన్నారు. ఈ నాలుగు ట్యాంకర్ల నెయ్యిలో వెజిటేబుల్, అనిమల్ ఫ్యాట్ కల్తీ జరిగినట్లు ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చిందని ఆయన చెప్పారు. కల్తీ నెయ్యి సప్లై చేసినందుకు జూలై 22,23,27 వ తేదీల్లో ఏఆర్ డెయిరీకీ షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు.
నెయ్యిలో తాము ఎలాంటి కల్తీ చెయ్యలేదని సెప్టెంబర్ 4వ తేదీన ఏఆర్ డెయిరీ టీటీడీకి రిప్లై ఇచ్చిందన్నారు. టీటీడీ నియమ నిబంధనలు ఉల్లంఘించి కల్తీ నెయ్యి సప్లై చేసినందుకు ఏఆర్ డెయిరీపై కేసు నమోదు చెయ్యాలని పోలీసులకు టీటీడీ ఫిర్యాదు చేసింది. టీటీడీ ఫిర్యాదు మేరకు ఏఆర్ డెయిరీపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!