సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ద్వారా విచారణ జరపాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఈ నిర్ణయం జస్టిస్ బీఆర్ గవాయ్ , జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం అందించిన విచారణలో వెలువడింది, ఇది ఈ రోజు ఉదయం జరిగింది. ఈ కేసు గురించి సుప్రీంకోర్టు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సమీక్షించడం జరిగింది. సిట్ దర్యాప్తు కొనసాగించాలని లేదా కేంద్ర దర్యాప్తు సంస్థలకు దర్యాప్తును అప్పగించాలా అనే అంశంపై అభిప్రాయం అడిగారు. జవాబుగా,…
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి ఖండించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారని ఆరోపిస్తూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలకు స్పందిస్తూ, కుమారస్వామి గురువారం ఎక్స్ ద్వారా వెల్లడించిన తన స్పందనలో, ఎన్డీఏ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మేస్తోందనే ఆరోపణలు నిరాధారమని, సత్యదూరమని స్పష్టం చేశారు. Rashid Khan: ఘనంగా…
విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే నెంబర్ వన్ స్టేట్ గా నిలిపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. బుధవారం సచివాలయంలో విద్యుత్ రంగానికి సంబంధించిన ప్రైవేటే విద్యుత్ ఉత్పత్తి సంస్థల అధిపతులతో మంత్రి గొట్టిపాటి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి దేశంలోని ప్రతిష్ఠాత్మక అన్నీ పునరుత్పాదక విద్యుత్ సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సమావేశంలో ఏపీ…
రైల్వే ఉద్యోగులకు శుభవార్త.. భారీగా బోనస్! కేంద్ర మంత్రివర్గం పలు పథకాలకు ఆమోదం తెలిపింది. చెన్నై మెట్రో ఫేజ్ 2కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని., మొత్తం 120 స్టేషన్లతో కూడిన ఈ దశలో కొత్తగా 3 కారిడార్లను నిర్మిస్తామని సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ కారిడార్ను చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ నిర్మిస్తుంది. దీని మొత్తం వ్యయం రూ.63,246 కోట్లు కాగా, ఇందులో సగం కేంద్రం, మిగితా సగం రాష్ట్రం…
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తిరుపతిలో పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం సాయంత్రం రేణిగుంట చేరుకుంటారు. అనంతరం శ్రీ బేడి ఆంజనేయస్వామిని దర్శించుకుంటారు. రాత్రి 9 గంటలకు బ్రహ్మోత్సవం సందర్భంగా శ్రీ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం పెద్దశేషు వాహనసేవలో పాల్గొంటారు. అనంతరం రాత్రికి శ్రీ పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు. 5వ తేదీ ఉదయం 8 గంటలకు శ్రీ వకుళమాత కేంద్రీకృత వంటశాలను ప్రారంభిస్తారు. ఉదయం 9 గంటలకు రేణిగుంట విమానాశ్రయం…
రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టమైన వివరాలు ఎప్పటికప్పుడు చెప్పినప్పటికి బీజేపీ పెద్దలు, రాష్ట్ర నాయకులు రైతులను గందరగోళ పరిచి వాళ్ల రాజకీయ పబ్బం గడుపుకునేందుకు దీక్షల పేరిట కొత్త డ్రామాకు తెరతీశారు. వారికి అర్థమయ్యే విధంగా మరొక్కసారి వివరాలన్ని తెలియజేస్తున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్రంలో మొత్తం రైతుల సంఖ్య 65.56 లక్షలు అని, వీరిలో తెలంగాణ రాష్ట్రంలో భూములు ఉండి, తెలంగాణలో ఉన్న బ్యాంకుల ద్వారా పంట రుణాలు తీసుకున్న రైతుల సంఖ్య 42 లక్షలు అని…
తెలంగాణ రాష్ట్రంలో 2030 నాటికి 20వేల మెగావాట్ల గ్రీన్ఎనర్జీని ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతున్నామని, ఈ నేపథ్యంలో సెమీకండక్టర్ల పరిశ్రమలకు ఇక్కడ మంచి అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి , ఇంధనశాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. జపాన్ పర్యటనలో భాగంగా ఆయన గురువారం క్విటో నగరానికి సమీపంలో ఉన్న ప్రముఖ సెమీకండక్టర్ల పరిశ్రమ రోహ్మ్ ను సందర్శించి నిర్వాహకులతో మాట్లాడారు. ఆయనకు రోహ్మ్ కంపెనీ ప్రెసిడెంట్ ఇనో, కంపెనీ ఉన్నతాధికారులు తకహసి,…
దక్షిణ తైవాన్ను హడలెత్తించిన క్రాథాన్ తుఫాన్.. ఇద్దరు మృతి దక్షిణ తైవాన్ను టైఫూన్ క్రాథాన్ బెంబేలెత్తించింది. అత్యంత శక్తివంతంగా తుఫాన్ దూసుకొచ్చింది. దీంతో ప్రజలు హడలెత్తిపోయారు. దాదాపు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడంతో వస్తువులు గాల్లోకి ఎగిరిపోయాయి. భారీ ఎత్తున ఆస్తులు కూడా ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఇద్దరు మరణించారు. ఇక భారీ వర్షం కారణంగా ప్రధాన ఓడరేవు నగరం కాహ్సియంగ్ను ముంచెత్తింది. దీంతో ద్వీపాన్ని రెండో రోజు కూడా మూసివేశారు.…
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్ నుంచే సన్నాలకు ఎమ్మెస్సీకి అదనంగా ఒక్కో క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గత సీజన్ లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు మూడు రోజుల్లో డబ్బులు ఇచ్చామని, ఈసారి 48 గంటల్లోపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ…