Harudu : హీరో వెంకట్ నటించిన హరుడు చిత్రం గ్లింప్స్ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శివరామరాజు ఫేమ్ వెంకట్, ఈ సినిమాతో మాస్ హీరోగా అవతారమెత్తుతున్నాడు. డాక్టర్ ప్రవీణ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజ్ తాళ్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. శనివారంనాడు హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం గ్లింప్స్‌ను విడుదల చేశారు. నిర్మాత డాక్టర్ ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ, “ఈ చిత్రానికి ఇంత స్థాయికి రావడానికి ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు. దర్శకుడు రాజ్ తాళ్లూరి రాత్రింబవళ్లూ పనిచేశారు. హీరో వెంకట్, శ్రీహరి, సలోని, హెబ్బా పటేల్ వంటి నటులు ఇందులో నటించారు. పాటలు మంచి ఆదరణ పొందుతాయని భావిస్తున్నాను,” అన్నారు. దర్శకుడు రాజ్ తాళ్లూరి మాట్లాడుతూ, “నిర్మాత డాక్టర్ ప్రవీణ్ రెడ్డికి ధన్యవాదాలు. ఆయన ఐదు నిమిషాల్లోనే కథ విని ఓకే చేశారు. వెంకట్ గారితో ఐదేళ్ల అనుభవం ఉంది. ఈ సినిమాలో ఆయన మాస్ పాత్రలో కనిపిస్తారు,” అన్నారు.
Minister Narayana: నెల్లూరు నగరాన్ని పోస్టర్ ఫ్రీ సిటీగా మారుస్తాం..
Also Read
హీరో వెంకట్ మాట్లాడుతూ, “హరుడు కమర్షియల్ ఎలిమెంట్‌తో కూడిన మాస్ ఎంటర్టైనర్. పోస్ట్ ప్రొడక్షన్ 60 శాతం పూర్తయింది. నాకు పవర్ ఫుల్ రోల్ దక్కింది, ఇది నా మాస్ పాత్ర,” అన్నారు. ఇంకా, “ఈ సినిమాలో ఐదు పాటలు ఉన్నాయి, సంగీతం జెన్నా అందించారు. మాస్ సినిమాకు ఫైట్స్ కీలకమైనవి, శివరాజ్ మాస్టర్ వాటిని బాగా కంపోజ్ చేశారు,” అని పేర్కొన్నారు. ఈ చిత్రం వచ్చే నెలలో విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు.
Sabarimala: అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం షాక్.. ఈ ఏడాది దర్శనం వారికే..!
https://youtu.be/3Mojn0dcqMk
తాజావార్తలు
-
Drought: కరువు భారతం.. తెలుగురాష్ట్రాల్లో మరింత ఘోరం!
-
DMK MLA: తమిళనాడులో మరో ఎమ్మెల్యేపై మహిళా అధికారిణి వేధింపుల ఆరోపణలు.. ఎఫ్ఐఆర్ నమోదు!
-
Mohammed Shami: పట్టించుకోవడం ఎప్పుడో మానేశా.. చేయాల్సింది చాలా ఉంది.. షమీ కీలక వ్యాఖ్యలు!
-
Viral Video: ఏంటి స్వామి ఈ పని..? రైలులో ఏదైనా జరగరానిది జరిగితే ఎలా..
-
Fake Doctor Racket Busted: 11వ తరగతి చదివి డాక్టర్‌గా అవతారం.. నకిలీ MBBS డిగ్రీలతో ఢిల్లీలో వైద్యం!
ట్రెండింగ్
-
25 రోజుల బ్యాటరీ బ్యాకప్, 100+ స్పోర్ట్స్ మోడ్స్ తో Vivo WATCH GT 2 స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Sineth Jayawardena: కోచ్ మాటలతో టీమిండియాపై చెలరేగిపోయా.. శ్రీలంక సెంచరీ హీరో సంచలన వ్యాఖ్యలు!
-
BSNL సంచలనం.. రూ.51కే 56GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్..!
-
IND vs NZ 2nd Test: అరంగేట్రంలోనే వికెట్ తీసిన గుర్నూర్.. లాథమ్ హాఫ్ సెంచరీతో దూకుడుగా..!
-
Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..