మహిళా కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం కేసులో జైలులో ఉన్న జానీ మాస్టర్‌కు బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. నేషనల్ అవార్డు అందుకునేందుకు ఆయన బెయిల్ కోరారు. అయితే, జానీ మాస్టర్‌కు వచ్చిన అవార్డును రద్దు చేయాలని పలువురు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జాతీయ చలనచిత్ర అవార్డును రద్దు చేశారు. అతనిపై పోక్సో కేసు నమోదు చేయడంతో, అవార్డు కమిటీ గౌరవాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. బెస్ట్ కొరియోగ్రఫీకి గాను 2022 జాతీయ చలనచిత్ర అవార్డుకు ఎంపికైన జానీ బాషా, న్యూఢిల్లీలో జరిగిన అవార్డు వేడుకకు హాజరు కావడానికి మధ్యంతర బెయిల్ పొందారు. అతను అక్టోబర్ 8వ తేదీన అవార్డును అందుకోవాల్సి ఉంది, కానీ రద్దుతో, ఇప్పుడు అతని బెయిల్ స్థితిపై అనిశ్చితి నెలకొంది.
Maa Nanna Super Hero Trailer : ‘మా నాన్న సూపర్ హీరో’ ట్రైలర్ రిలీజ్ చేసిన మహేశ్‌బాబు