జానపద సింగర్, రైటర్ మల్లిక్‌తేజ తనపై లైంగికదాడికి యత్నించాడని సహచర గాయని గత ఆదివారం జగిత్యాలలోని టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.. అయితే.. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే.. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫోక్ సింగర్ మల్లిక్ తేజాకు హైకోర్టులో ఊరట లభించింది. మల్లిక్ తేజ్‌కు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఫోక్ సింగర్ మల్లిక్ తేజా తరఫు న్యాయవాది లక్ష్మణ్ మాట్లాడుతూ.. అమ్మాయిలు అక్రమ కేసులు పెట్టి మగవాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఫోక్ సింగర్ మౌనిక అనే మహిళా ఫేమస్ ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్ ఫై కేసు పెట్టిందని, మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో డబ్బులు ఇవ్వాలని కేసు పెట్టిందన్నారు.
Minister Narayana: నెల్లూరు నగరాన్ని పోస్టర్ ఫ్రీ సిటీగా మారుస్తాం..
ఇప్పుడు జగిత్యాల లో రేప్ కేసు పెట్టిందని, దీనిపై హైకోర్టు కు వెళ్ళామన్నారు. మల్లిక్ తేజాకి అక్రమ కేసు అని హై కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిందన్నారు. అనంతరం మల్లిక్ తేజా మాట్లాడుతూ.. నాపై తప్పుడు కేసులు పెట్టిందని, ఆమె ఫోక్ సింగర్ గా ఎదగడానికి నేనే కారణమన్నారు. స్టార్ డమ్ వచ్చిన తర్వాత నాపై అక్రమ కేసులు పెట్టిందని, నన్ను చాలా బ్లాక్ మెయిల్ చేసిందన్నారు. డబ్బులు కావాలని నన్ను ఇబ్బందులకు గురి చేసిందని, నాకు సపోర్ట్ గా నిలిచిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు తెలిపారు.
Sabarimala: అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం షాక్.. ఈ ఏడాది దర్శనం వారికే..!