హిజ్బుల్లా, ఇరాన్‌తో విభేదాల మధ్య అరబ్ దేశాలు ఇప్పుడు ఇజ్రాయెల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలాయి. టెహ్రాన్, ఇజ్రాయెల్ మధ్య వివాదంలో తాము తటస్థంగా ఉంటామని ఇరాన్‌కు భరోసా ఇవ్వడానికి అరబ్ దేశాలు ఈ వారం దోహాలో సమావేశమయ్యాయి. ఈ ప్రాంతంలో వివాదాలు పెరగడం వల్ల తమ చమురు కేంద్రాలకు ముప్పు వాటిల్లుతుందని అరబ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
యాపిల్ ప్రపంచవ్యాప్తంగా సూపర్ ఫుడ్‌గా పేరుగాంచిన పండు. రోజూ ఒక యాపిల్ తింటే వంద రోగాల నుంచి దూరం అవుతుందంటారు. అయితే యాపిల్స్‌లో చాలా రకాలు ఉన్నాయని మీకు తెలుసా..? దాని రంగులను బట్టి పోషకాలు కూడా మారుతూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 7500 రకాల ఆపిల్లు ఉన్నాయి.
స్త్రీ అయినా, పురుషుడైనా అందరూ అందంగా కనిపించడం కోసం తమ ముఖానికి ఏదో ఒకటి రాసుకుంటూ ఉంటారు. కొంతమంది తమ ముఖాన్ని మచ్చలు లేకుండా, అందంగా మార్చుకోవడానికి రకరకాల క్రీమ్స్ పూస్తుంటారు. చాలా మంది తమ ముఖానికి వేప, తేనెను వాడతారు.
జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారు వెల్లుల్లిని ఉపయోగించడం వల్ల ఉపశమనం లభిస్తుంది. వెల్లుల్లిలో అనేక సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి స్కాల్ప్ యొక్క రంధ్రాలను తెరవడానికి, జుట్టు పెరుగుదలను పెంచడంలో సహాయపడతాయి. అంతే కాకుండా.. వెల్లుల్లి యొక్క కొన్ని క్రియాశీల సమ్మేళనాలు జుట్టుకు పోషణను అందిస్తాయి. వెల్లుల్లిని జుట్టుకు అప్లై చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
ఢిల్లీ మెట్రోలో టిక్కెట్లు లేకుండా ప్రయాణించే ఉదంతాలు చాలాసార్లు వెలుగులోకి వచ్చాయి. చాలా సార్లు మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు ఫ్లోర్‌పై కూర్చోవడం కనిపిస్తుంది. టికెట్ లేకుండా ప్రయాణించడం, ఫ్లోర్‌పై కూర్చోవడం, జరిమానా కూడా విధించే విషయంలో మెట్రో నిబంధనలు రూపొందించింది.
భారత్‌లో హైడ్రోజన్‌తో నడిచే రైళ్లు త్వరలో పట్టాలెక్కనుంది. ఈ క్రమంలో.. జర్మనీకి చెందిన TUV-SUD రైలు భద్రతకు సంబంధించి సేఫ్టీ ఆడిట్ నిర్వహించనుంది. ఈ రైలు ట్రయల్ రన్ డిసెంబర్ 2024లో ప్రారంభమవుతుందని సమాచారం. జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, చైనాలో హైడ్రోజన్ రైళ్లు నడుస్తున్నాయి.
గత ప్రభుత్వ హయాంలో సర్వేపల్లిలో ఇసుక, గ్రావెల్ అక్రమాలు భారీగా జరిగాయని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. కోట్ల రూపాయల అవినీతికి అప్పటి వైసీపీ ప్రభుత్వం పాల్పడిందని ఆయన మండిపడ్డారు. సూరాయపాలెంలో రూ. 54 కోట్లు, విరువూరులో రూ. 37 కోట్ల రూపాయల మేర పెనాల్టీని గనుల శాఖ విధించిందని, రైతుల పేరుతో అనుమతులు తెచ్చి లక్షల క్యూబెక్ మీటర్ల గ్రావెల్ ను తవ్వేశారన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అప్పటి మంత్రి కాకాణి గోవర్ధన్…
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర బృందంతో విచారణ జరిపించడం మంచిదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ సందర్భంగా ఐదుగురు సభ్యులతో స్వతంత్ర దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని జస్టిస్ బీఆర్ గవాయ్ సూచించారు. ఈ బృందంలో ఇద్దరు సీబీఐ అధికారులు, ఇద్దరు రాష్ట్ర పోలీసు అధికారులు, , ఒక ఫుడ్ సేఫ్టీ అధికారి ఉండాలని ప్రస్తావించారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించారు. Rashmika Mandanna: మరీ అంత క్యూట్…
విద్యుత్ రంగంలో ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలుపుతాం విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే నెంబర్ వన్ స్టేట్ గా నిలిపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. బుధవారం సచివాలయంలో విద్యుత్ రంగానికి సంబంధించిన ప్రైవేటే విద్యుత్ ఉత్పత్తి సంస్థల అధిపతులతో మంత్రి గొట్టిపాటి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి దేశంలోని ప్రతిష్ఠాత్మక అన్నీ పునరుత్పాదక విద్యుత్ సంస్థల ప్రతినిధులు…
సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ద్వారా విచారణ జరపాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నిర్ణయం జస్టిస్ బీఆర్ గవాయ్ , జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం అందించిన విచారణలో వెలువడింది, ఇది ఈ రోజు ఉదయం జరిగింది. ఈ కేసు గురించి సుప్రీంకోర్టు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సమీక్షించడం జరిగింది. అయితే.. దీనిపై మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ.. శ్రీవారి లడ్డూ ప్రసాదాల వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు ఆహ్వానించదగ్గ…