ఇరాన్ మంగళవారం ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం కురిపించింది. అయితే ఈ దాడి కేవలం క్షిపణుల దాడి మాత్రమే కాదు.. బదులుగా, ఈ క్షిపణులు 700-1000 కిలోల వార్‌హెడ్ పేలోడ్‌ను కలిగి ఉన్నాయి. ఇది మొత్తం భవనాన్ని నాశనం చేయగలదు. మన యుద్ధాల చరిత్రలో ఇది అపూర్వమని భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ అన్నారు.
Bathukamma Day-2: తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజైన నిన్న(అక్టోబర్ 2) ఎంగిలిపూల బతుకమ్మను తయారు చేసి ఆడిపాడిన మహిళలు రెండోరోజు అటుకుల బతుకమ్మను సిద్ధం చేయనున్నారు.
లెబనాన్ రాజధాని బీరూట్‌లోని హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేయడంతో మరణించిన అగ్రశ్రేణి హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లా అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించనున్నట్లు నివేదికలు తెలిపాయి.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 సాధారణ బడ్జెట్లో పీఎం ఇంటర్న్‌షిప్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. నేటి నుంచి ఈ పథకం ప్రారంభం కానుంది. ఇందుకోసం పోర్టల్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేశారు. ఇంటర్న్ కోసం ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 12 నుండి ఈ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
రాజకీయ నాయకురాలుగా మారిన నటి కంగనా రనౌత్ తన వివాదాస్పద ప్రకటనలతో హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నారు. బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా, బుధవారం ఆమె మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కొత్త వివాదం సృష్టించారు.
ఇజ్రాయెల్ దూకుడును లెక్కచేయకుండా చాలా కాలంగా సంయమనం పాటిస్తున్న ఇరాన్ మంగళవారం రాత్రి వరుస క్షిపణి దాడులకు పాల్పడింది. ఇరాన్ క్షిపణి దాడుల తర్వాత ఇజ్రాయెల్ ఆగ్రహంతో ఉంది. ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటానని బెదిరించింది. ఇప్పుడు ఇరాన్ అణ్వాయుధ కేంద్రాలే ఇజ్రాయెల్ తదుపరి లక్ష్యమని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది సంఘర్షణను మరింత తీవ్రతరం చేయడమే కాకుండా ప్రపంచాన్ని మూడవ ప్రపంచ యుద్ధం వైపు తీసుకెళుతుందంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
దేశం మొత్తానికి రుతుపవనాలు వీడ్కోలు పలకబోతున్నాయి. అక్టోబర్ 15 నాటికి రుతుపవనాలు పూర్తిగా కనుమరుగవుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఐఎండీ ప్రకారం, ఈ సంవత్సరం దేశంలో సాధారణం కంటే 8 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది చలి తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని కూడా వాతావరణ శాఖ చెబుతోంది.
చంద్రుడి నుంచి మట్టి నమూనాలను తీసుకురావడానికి భారత్ సిద్ధమవుతోంది. 2029లో చంద్రయాన్-4 మిషన్ చంద్రుడిపైకి వెళ్లి అక్కడి నుంచి మట్టి నమూనాలను తీసుకువస్తుందని ఇస్రో తెలిపింది.
నేటితో ఈ స్వచ్ఛ భారత్ మిషన్ పదేళ్లు పూర్తి చేసుకుంది. గాంధీ జయంతి సందర్భంగా చిన్నారులతో కలసి స్వచ్ఛతా కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ రోజు ప్రజలు పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రధాని కోరారు.
మహారాష్ట్రలోని పుణె జిల్లాలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటన పైలట్, ఇద్దరు ఇంజనీర్లు మృతి చెందారు. పుణె జిల్లాలో బుధవారం ఉదయం హెలికాప్టర్ కూలిపోయి మంటలు చెలరేగడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారని పోలీసులు వెల్లడింటారు.