సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి, కార్డియాక్ అరెస్ట్‌తో ప్రాణాలు కోల్పోయింది. శుక్రవారం సాయంత్రం గాయత్రికి ఈ ఆరోగ్య సమస్య రావడంతో, హైదరాబాదులోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే శనివారం మరణించింది. ఈ సంఘటనతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. గాయత్రి భౌతికకాయాన్ని హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలోని ఇంటికి తీసుకువచ్చారు. రాజేంద్ర ప్రసాద్‌కు ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు తన కండ్లముందే చనిపోవడంతో ఆయన కన్నీరు మున్నీరు విలపిస్తున్నారు. గాయత్రి అంత్యక్రియలు అక్టోబర్ 6న జరగనున్నాయి.
Congress: కాంగ్రెస్ వేదికపైనే మహిళా నేతకి లైంగిక వేధింపులు..
గాయత్రి డాక్టర్‌గా వృత్తి నిర్వహిస్తున్నది. ఆమె ప్రేమ పెళ్లి కారణంగా రాజేంద్ర ప్రసాద్‌తో కొంత కాలం విభేదాలే చోటు చేసుకున్నాయి. అయితే, ఇటీవల కాస్త కలుసుకున్నారు. ఆమెకు ఒక కూతురు ఉంది, ఆ చిన్నారి ‘మహానటి’ సినిమాలో జూనియర్ సావిత్రిగా నటించి ప్రత్యేక గుర్తింపును పొందింది. గాయత్రి మరణంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబంలో విషాదఛాయలు వ్యాపించాయి. ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్‌ను పరామర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆయనకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన అన్నారు, “గాయత్రి హఠాన్మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.”
రాజేంద్ర ప్రసాద్ భావోద్వేగం
అయితే.. రాజేంద్ర ప్రసాద్ గతంలో తన కూతురు గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ‘బేవార్స్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ, “నాకు పదేళ్ల వయసులోనే నా తల్లి చనిపోయారు. నా కూతురిలోనే ఆమెను చూస్తున్నాను” అని చెప్పారు. గాయత్రి ప్రేమ పెళ్లి తర్వాత కొంత కాలం ఆమెతో మాట్లాడలేదని, అయితే ఆయన ఆమెను ఇంటికి పిలిచి, ఈ సినిమా లోని ‘అమ్మ’ పాటను పలుమార్లు వినిపించినట్లు ఎమోషనల్ అయ్యారు. అయితే.. రాజేంద్ర ప్రసాద్ తన కూతురు పట్ల ఎంత ప్రేమ ఉన్నారో, నెటిజన్లు , అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. గాయత్రి ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ ప్రార్థిస్తున్నారు.
Supreme Court: రేషన్ కార్డుల జాప్యంపై ధర్మాసనం తీవ్ర అసహనం.. ఓపిక నశించిందని వ్యాఖ్య