దశాబ్దాల నిరీక్షణకు తెర పడింది. మూడు దశాబ్దాలుగా ప్రమోషన్ కోసం వేచి చూస్తున్న జూనియర్ అసిస్టెంట్లకు గ్రేడ్ 3 ఈవోలుగా పదోన్నతి కల్పించనుంది రాష్ట్ర సర్కార్. జీవో 134 ద్వారా 33 మంది జూనియర్ అసిస్టెంట్లకు గ్రేడ్ 3 ఈవోలుగా పదోన్నతి పొందనున్నారు. కాగా.. సచివాలయంలో మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ప్రమోషన్ పత్రాల స్వీకరణ కార్యక్రమం జరిగింది.
సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి, కార్డియాక్ అరెస్ట్‌తో ప్రాణాలు కోల్పోయింది. శుక్రవారం సాయంత్రం గాయత్రికి ఈ ఆరోగ్య సమస్య రావడంతో, హైదరాబాదులోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే శనివారం మరణించింది. ఈ సంఘటనతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. గాయత్రి భౌతికకాయాన్ని హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలోని ఇంటికి తీసుకువచ్చారు. రాజేంద్ర ప్రసాద్‌కు ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు…
పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదైంది. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను మధురైలోని కమిషనరేట్ లో వాంజినాధన్ అనే లాయర్ కంప్లైంట్ ఇచ్చాడు. సనాతన ధర్మం పై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను పవన్ వక్రీకరించారని ఫిర్యాదులో తెలిపారు. వెంటనే అతడిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సనాతన…
ఇండియాలో జీప్ కంపాస్ SUV యొక్క ప్రత్యేక వార్షికోత్సవ ఎడిషన్‌ను విడుదల చేసింది. యానివర్సరీ ఎడిషన్‌ను, సరికొత్త అప్ డేట్స్‌తో (అక్టోబర్ 3) గురువారం రోజు లాంచ్ చేసింది. ఈ కొత్త ఎడిషన్ లో కాస్మెటిక్, యాక్సెసరీ అప్డేట్స్ ఉన్నాయి. లిమిటెడ్ ఎడిషన్ జీప్ కంపాస్ బ్రాండ్ కు భారత్ లో ఎనిమిదేళ్ళు పూర్తి అయిన సందర్భంగా యానివర్సరీ ఎడిషన్ ను ప్రకటించారు.
కెనడాలో ఓ రెస్టారెంట్లో వెయిటర్ ఉద్యోగం కోసం భారతీయ విద్యార్థులు దాని ముందు బారులు తీరిన వీడియోని చూస్తే, పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థమవుతుంది. కెనడాలో తందూరి ఫ్లేమ్ అనే రెస్టారెంట్ ముందు, జాబ్ ఇంటర్వ్యూ కోసం భారతీయ విద్యార్థులు క్యూలో నిలుచున్న వీడియో వైరల్ అవుతోంది. వేలాది మంది వెయిటర్, సర్వీస్ స్టాఫ్ ఉద్యోగాల కోసం వరసలో ఉ
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు పై మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. హరీష్ రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తా అంటున్నాడని, దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది కేసీఆర్ కుటుంబమని ఆయన మండిపడ్డారు. ఇన్ని మాటలు చెప్పి మోసం చేసిన కేసీఆర్ కుటుంబం కి రాహుల్ గాంధీ ఇంటి ముందు దీక్ష చేసే హక్కులేదని, ఒక్క హామీ అమలు చేయని నువ్వు రాహుల్ గాంధీ ఇంటి ముందు…
తిరుపతి జిల్లా పుంగనూరులో కిడ్నాప్ తర్వాత దారుణ హత్యకు గురైన చిన్నారి అస్పియ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. చిన్నారి మృతి బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరిగినా కూడా పోలీసులు దోషులపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.
ఇటీవల నూతనంగా ప్రారంభించిన రెస్టారెంట్లలో ఆకర్షణీయమైన ఆఫర్లతో భోజన ప్రియులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక రూపాయి, రెండు రూపాయలకే బిర్యానీ అందిస్తూ రెస్టారెంట్లు ముందుగా ఆకట్టుకుంటాయి. తాజాగా ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో నూతనంగా ప్రారంభమైన ఓ రెస్టారెంట్ నిర్వాహకుడు కళ్లు చెదిరిపోయే బంపర్ ఆఫర్ పెట్టాడు.