మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న విద్యార్థి రాహుల్ ఇంట్లో గొడవ పడి సూసైడ్ చేసుకున్నాడు. స్థానికంగా ఉన్న ధనలక్ష్మి ఫర్టీ లైజర్ షాపులో పురుగుల మందు కొనుగోలు చేసి పక్కనే ఉన్న పర్వతపురం గుట్టల్లోకి వెళ్లి పురుగుల మందు తాగాడు. అనంతరం రాహుల్ ఇంటికి వీడియో కాల్ చేసి తాను చనిపోతున్నట్లు తెలిపాడు.
ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. వియత్నాం రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ గ్యాంగ్ సోమవారం ఢిల్లీలో చర్చలు జరిపారు.
ఈనెల 22న(గురువారం) ముఖ్యమంత్రి కేసీఆర్ సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. పటాన్ చెరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్ పర్యటన వివరాలను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వెల్లడించారు.
ప్రధాని నరేంద్ర మోడీ జూన్ 24 నుంచి ఈజిప్టు పర్యటనకు వెళ్లనున్నారు. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతాహ్ అల్-సిసి ఆహ్వానం మేరకు మోడీ రెండు రోజుల పర్యటన జూన్ 24న ప్రారంభం కానుంది.
ఉత్తరాఖండ్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ్‌లోని చంపావత్ జిల్లాలో రీతా సాహిబ్ గురుద్వారా నుండి తిరిగి వస్తున్న బస్సు బోల్తా పడడంతో పంజాబ్‌కు చెందిన కనీసం 25 మంది యాత్రికులు గాయపడ్డారని పోలీసులు సోమవారం తెలిపారు.
బీహార్ మాజీ ముఖ్యమంత్రి జీతన్‌రామ్ మాంఝీకి చెందిన హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) సోమవారం నితీశ్ కుమార్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.
తెలంగాణ సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 26 నుంచి రైతు బంధు నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వానాకాలం పంట పెట్టుబడి కింద రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. రాష్ట్ర రైతాంగానికి ఎప్పటిలాగే నేరుగా వారి వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని.. అందుకు చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖామంత్రి హరీష్ రావును అదనపు ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావును సీఎం కేసీఆర్ ఆదేశించారు.
తెలంగాణకు చల్లటి కబురు అందింది. రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
తాను ఎంపీ లాడ్స్ నిధులతో ఇల్లు కట్టాను, పెళ్లి చేశాను అనేది అవాస్తవమన్నారు. మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ పార్టీలోకి వచ్చినప్పటి నుంచి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తాను అలా అనలేదని.. రమేష్ రాథోడ్, జిల్లా అధ్యక్షుడు శంకర్ పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. నిధులు క్యాడర్ కు ఇస్తే పార్టీకి క్యాడర్ కు తనకు పేరు వచ్చింది కనుక ఆ నేతలు ఇలా కుట్రలు చేస్తున్నారని తెలిపారు.