సీఎం జగన్ నేడు జగనన్న సురక్షా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. జగనన్నకు చెబుదాంకు అనుబంధంగా జగనన్న సురక్ష జరుగుతుందని తెలిపారు. మండలానికి రెండు సచివాలయాలలో ఒక్కోరోజు క్యాంపులు జరుగుతాయని, ప్రతి లబ్ధిదారులకు న్యాయం చేయాలన్నదే లక్ష్యమన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. 11 రకాల సర్టిఫికెట్లు అదేరోజు జారీ చేస్తామని, 1902 ద్వారా ఇప్పటికే వచ్చిన సమస్యలను కూడా పరిష్కరిస్తున్నామన్నారు. 99.5 శాతం ప్రజలకు లబ్ది చేకూర్చామని, సీఎం జగన్ అందరికీ న్యాయం చేయాలనే సంకల్పంతో కార్యక్రమం చేపట్టామన్నారు.
అంతేకాకుండా.. ‘ సచివాలయాల వ్యవస్థ ద్వారా పారదర్శకంగా పథకాలు అందిస్తున్నాం.
Also Read : JoSAA Counselling: జూన్ 30న జోసా మొదటి విడత సీట్ల కేటాయింపు.. 25న మాక్ సీట్ల కేటాయింపు
నాలుగు వారాలపాటు జల్లెడ పట్టే కార్యక్రమం చేస్తున్నాం. 26 జిల్లాలకు 26 మంది స్పెషల్ ఆఫీసర్లను నియమించాం. వారి పర్యవేక్షణలో సురక్ష కార్యక్రమం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ వి పిచ్చిమాటలు. రోజుకొక మాట మాట్లాడుతున్నారు. రెండు సార్లు సీఎంని చేయమని అడగటం ఏంటి?. అసలు ఎమ్మెల్యేనే కాలేదు. రాష్ట్రంలో ప్రజలందరికీ న్యాయం జరిగిందా? లేదా? అని మేము అడిగిమరీ పనులు చేస్తున్నాం. అదేమంటే అవినీతి అంటూ పవన్ మాట్లాడుతున్నారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే నగదు జమ చేస్తుంటే ఇక అవినీతి ఎక్కడ జరుగుతుంది?. ఎస్సీలకు అందుతున్న పథకాల గురించి త్వరలోనే శ్వేతపత్రం అందిస్తాం. ఎల్లోమీడియా తప్పుడు వార్తలతో ప్రజలను గందరగోళం చేయాలని చూస్తున్నాయి. ప్రజలకు వాస్తవాలు అన్నీ తెలుసు. విజయవాడలో రూ.350 కోట్లతో. అంబేద్కర్ విగ్రహాన్ని పెడుతన్నాం. టీడీపీ వారు అవివేకంతో మాట్లాడుతున్నారు.’ అని ఆయన అన్నారు.
Also Read : Arab Countries: అరబ్ దేశాల్లో మహిళల్లో ఊబకాయం ఎక్కువ