కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అయితే.. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 18 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివున్నట్లు అధికారులు తెలిపారు. నిన్న శ్రీవారిని 72,304 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,504 మంది భక్తులు తలనీలాలు సమర్పించిన్లు, నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.80 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే.. సెప్టెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను శనివారం విడుదల చేయనుంది టీటీడీ.
Also Read : Sobhita Dhulipala : సరికొత్త లుక్ లో మెరిసిపోతున్న శోభిత..
శనివారం ఉదయం రూ.300 ప్రత్యేక దర్శన టోకెన్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు టీటీ అధికారులు వెల్లడించారు. అదేవిధంగా వసతి గదుల కోటాను ఆదివారం విడుదల చేయనుంది టీటీడీ. ఇప్పటికే ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేసింది. ఈ నెల 22న ఆర్జిత సేవా టికెట్లు, 23న అంగప్రదక్షిణం టికెట్ల కోటాను విడుదల చేసిన టీటీడీ.. జూన్ 24 నుంచి 26 వరకు శ్రీవారి సాక్షాత్కార వైభవోత్సవాలు నిర్వహించనున్నారు.
Also Read : KTR Delhi Tour: నేడు హరిదీప్ సింగ్ తో కేటీఆర్ భేటీ.. ఇంకా ఖరారు కాని అమిత్ షా అపాయింట్మెంట్..?