కాంగ్రెస్‌ను సంస్థాగతంగా బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్ర రాజు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా స్థాయిలో, నియోజక వర్గ స్థాయిలో సమన్వయ కమిటీలు నిర్వహిస్తున్నామన్నారు. సీఎం జగన్ నాలుగేళ్లలో ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. కడప స్టీల్ పరిశ్రమ ఏమైందని, జిల్లాలో చెన్నూరు చెక్కర కర్మాగారం.. కొప్పర్తి లో పారిశ్రామిక అభివృద్ధి లేదన్నారు. శాంతి భద్రతలు రాష్ట్రంలో కనుమరుగయ్యాయని, కడపలో పట్ట పగలే దారుణ హత్య జరిగిందన్నారు.
Also Read : MS Vishwanathan: ‘మెల్లిసై మన్నార్’ ఎమ్మెస్ విశ్వనాథన్!
పథకం ప్రకారం దళితుల పైన, అన్ని వర్గాల పై దాడులు, హత్యకు జరుగుతున్నాయన్నారు. సీఎం సొంత జిల్లాలోనే లా అండ్ ఆర్డర్ విఫల మైందన్న రుద్ర రాజు.. పోలీసులు అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా మారారన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో ఐదు లక్షల కోట్ల ప్యాకేజీ ఇచ్చారని, వెనుక బడిన రాయలసీమకు ఇచ్చిన ప్యాకేజీ సిఎం జగన్ తీసుకుని రాలేక పోయారన్నారు. స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రతిష్టను తాకట్టు పెట్టారని, ప్రత్యేక తరగతి హోదా కాంగ్రెస్ విధానమన్నారు. అధికారంలోకి వస్తే ఇస్తామని, వైసీపీ, బీజేపీకి అన్ని విషయాల్లో మద్దుతు ఇస్తోందని, అయితే ఇటీవల అమిత్ షా మొన్న సీఎంపై చేసిన అవినీతి, అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో సమగ్ర విచారణ చేయాలన్నారు. రాష్ట్ర విశాల ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ను ప్రజలు బలపరిచాలని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్ద శక్తిగా ఉండబోతోందన్నారు.
Also Read : Telangana BJP: రాజధానికి రండి.. కిషన్ రెడ్డి, ఈటల, రాజగోపాల్‌కు హైకమాండ్ పిలుపు