టమాటా ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. టమాటా ధరలు ఆకాశాన్నంటడంతో దానిని కొనుగోలు చేయడమే మానేశారు. గత రెండు వారాల్లో దేశంలోని వివిధ నగరాల్లో టమాటా ధర జెట్ స్పీడ్ వేగంతో పెరిగి 100ను దాటింది. దీంతో కొన్ని నగరాల్లో కిలో రూ.120 ధరకు విక్రయించడం ప్రారంభించారు. కానీ ఇప్పుడు టమోటాలు మరింత ఖరీదైనవిగా మారాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో టమోటా రిటైల్ ధర కిలో రూ. 160కి చేరుకుంది.
గత 24 గంటల్లో మహారాష్ట్ర రాజకీయాలు చాలా మలుపులు తిరిగాయి. అజిత్ పవార్ తిరుగుబాటు తర్వాత ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పగ్గాలు చేపట్టారు. సోమవారం సతారాలో విలేకరుల సమావేశంలో శరద్ పవార్ మాట్లాడుతూ.. అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. అయితే సమయం వచ్చినప్పుడు అందరూ నా వెంటే ఉంటారని శరద్ పవార్ స్పష్టం చేశారు. మరోవైపు నేటి నుంచి మార్పు మొదలవుతుందని, ఎన్సీపీ మరింత పటిష్టంగా ముందుకు సాగుతుందని, ప్రజల మద్దతు తమకు ఉంటుందని శరద్…
మహారాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనల మధ్య విపక్షాల రెండో సమావేశం వాయిదా పడినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ సమావేశం ఈనెల 17, 18 తేదీల్లో బెంగళూరులో జరగనున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ట్వీట్ చేశారు.
హైదరాబాద్ కోకాపేట్లోని వన్ గోల్డెన్ మైల్లో మైక్రోచిప్ టెక్నాలజీ ఇండియా సెమీకండక్టర్ డిజైన్, డెవలప్మెంట్ ఫెసిలిటీని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాస్కోమ్ లెక్కల ప్రకారం దేశంలో సెమీకండక్టర్ రంగంలో 1/3 ఉద్యోగాలు హైదరాబాదు నుంచే ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. బెంగళూరు చెన్నైల కన్నా హైదరాబాద్ ముందంజలో ఉందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
నిన్న ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహించిన జనగర్జన సభలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొని బీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. అయితే.. తాజాగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.. breaking news, latest news, telugu news, jagadish reddy, big news, rahul gandhi,