America: అగ్రరాజ్యంలో మళ్లీ తుపాకీ ఘోష.. స్వాతంత్య్ర దినోత్సవం రోజునే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
America: అమెరికాలో తుపాకీ సంస్కృతి మళ్లీ బుసలు కొట్టింది. స్వాతంత్య్ర దినోత్సవ రోజున కూడా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. రెండు రోజుల్లోనే 8మంది దాకా ఈ తుపాకీ సంస్కృతికి బలయ్యారు. మరో 28మంది దాకా గాయపడ్డారు. వాషింగ్టన్ డీసీలో బుధవారం తెల్లవారు జామున జరిగిన కాల్పుల్లో ఇద్దరు పిల్లలతో సహా 9మంది తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారు జామున ఒంటిగంట ప్రాంతంలో రాజధానిలోని మీడ్ స్ట్రీట్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నవారిపై కారులో వచ్చిన దుండగులు కాల్పులు జరిపి పారిపోయారని అసిస్టెంట్ చీఫ్ పార్సన్స్ తెలిపారు. బాల్టిమోర్‌లో ఆదివారం తెల్లవారు జామున జరిగిన దాడిలో అయిదుగురు చనిపోయారు. టెక్సాస్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మునిగివున్న ప్రజలపై సోమవారం అర్ధరాత్రి సమయంలో పలువురు వ్యక్తులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, 8మంది గాయపడ్డారని అధికారులు చెప్పారు.
Also Read: Manipur: రైతుల రక్షణ కోసం వీఐపీల భద్రత తగ్గింపు
Also Read
ఫిలడెల్పియాలోని కింగ్‌సెస్సింగ్‌లో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించిన సాయుధుడు వీధుల్లో తిరుగుతూ కనబడిన వారిపైకి కాల్పులు సాగించాడు. సమాచారం అందుకుని పోలీసులు చుట్టుముట్టడంతో అతడు లొంగిపోయాడు. ఆగంతకుడి వద్ద నుంచి ఏఆర్ రైఫిల్, హ్యాండ్‌గన్ స్వాధీనం చేసుకున్నారు. అతడి కాల్పుల్లో అయిదుగురు చనిపోయారు. మరో ఇద్దరు 2, 13 ఏళ్ల బాలురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. మరో ఘటన..టెక్సాస్‌లోని ఫోర్ట్‌వర్త్‌లోస్థానిక ఉత్సవం కోమోఫెస్ట్‌లో పాల్గొన్న జనంపైకి గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోగా 8 మంది గాయపడ్డారు.
తాజావార్తలు
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
-
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
-
Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
-
Harish Rao : తుగ్లక్ నిర్ణయాలతో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది..
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!