ప్రతి ఆరుగురిలో ఒకరు సంతానలేమి సమస్యను అనుభవిస్తున్నారు. అయితే ఇతరులకు దూరం అవుతామనే భయం, బిడియం, అపోహల కారణంగా చాలా మంది సంతాన సాఫల్య చికిత్సల సహాయం తీసుకోవడానికి వెనుకాడుతున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లా తహసీల్ ఆమ్లాలో ఆదివారం ఎన్ఐఏ దాడులు కలకలం సృష్టించాయి. ముంబైలో పనిచేస్తున్న ఓ పెయింటర్ ఇంటిపై ఎన్ఐఏ దాడులు నిర్వహించింది. పెయింటర్‌కు పాకిస్థాన్‌తో సంబంధాలున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక పోలీసులతో కలిసి ఎన్ఐఏ బృందం దాడులు చేసింది. పెయింటర్ తౌహీద్‌కు పాకిస్థాన్ యువకుడితో సంబంధాలున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
భారత్ జోడో యాత్రకు కొనసాగింపే ఈ పీపుల్స్ మార్చ్ యాత్ర అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. పాదయాత్రలో అందరి కష్టాలను తెలుసుకున్నామని ఆయన తెలిపారు. పీపుల్స్ మార్చ్‌ను ఆదిలాబాద్ నుంచి ప్రారంభించామని భట్టి పేర్కొన్నారు.
ఈసారి ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్.. గతానికి భిన్నంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆపరేషన్ ఆకర్షన్‌తో పలువురిని పార్టీలోకి రప్పించే పనిలో ఉండగా... పొంగులేటి, జూపల్లితో పాటు ఇతర నేతలను పార్టీలోకి రప్పించటంలో విజయవంతం అయింది.
గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా హృద్రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. అత్యంత భయానక విషయమేమిటంటే యువతలో కూడా గుండె జబ్బులు, గుండెపోటు సమస్యలు కనిపిస్తున్నాయి. చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, మద్యపానం-ధూమపానం మరియు వ్యాయామం లేకపోవడం వంటివి గుండె జబ్బులు పెరగడానికి ప్రధాన కారణాలు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఖమ్మంలో జరగనున్న కాంగ్రెస్ జన గర్జన సభకు ఏర్పాట్లు చేశారు. ఖమ్మం నగరంలో కాంగ్రెస్ ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ సభకు ఖమ్మంతోపాటు మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనాన్ని తరలించేందుకు పార్టీ నేతలు, క్యాడర్ ఏర్పాట్లు చేస్తున్నారు.
కొత్త సెల్టోస్ భారత మార్కెట్లో ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉంది. జూలై 4న సెల్టోస్ యొక్క ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేయనుంది. గత కొంతకాలంగా ఆటో మేకర్ ఈ కారు టీజర్లను విడుదల చేస్తోంది. అయితే మరోసారి రాబోయే సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ టీజర్ విడుదలైంది.