Huge Theft: గుంటూరులో భారీ చోరీ జరిగింది. కొత్తపేట మంగళబావి వీధిలో పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలో ఉన్న ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు 3.5 కేజీల బంగారం, 5 కేజీల వెండి వస్తువులు, 2 లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. తమ బంధువులను ట్రైన్ ఎక్కించడానికి వ్యాపారి కుటుంబం విజయవాడ వెళ్లగా… తిరిగి వచ్చేసరికి తలుపుల తాళాలు పగలకొట్టి బంగారు, వెండి వస్తువులను దుండగులు దోచుకెళ్లారు. దోపిడీకి గురైన మొత్తం రెండు కోట్లకు పైగా ఉంటుందని పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు.
Also Read: USA: అమెరికాలో మరో జార్జ్ ఫ్లాయిడ్ తరహా ఘటన.. నల్లజాతి మహిళపై పోలీసుల దాష్టీకం
బాధితుడు నర్సింహ్మరావు ఫిర్యాదుతో రంగంలోకి కొత్తపేట పోలీసులు దిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వ్యవధిలో దొంగతనం జరిగినట్టు గుర్తించారు. రద్దీగా ఉండే ప్రాంతం, పోలీసు స్టేషన్ కు దగ్గర ఉన్న ప్రాంతంలో చోరీ జరగడంతో పోలీసులు కూడా అవాక్కయ్యారు. దొంగల ఆచూకీ కోసం క్లూస్ టీం , డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది.