రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. అన్ని జిల్లాల వైద్య అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్నం 2 breaking news, latest news, telugu news, harish rao, big news, heavy rains
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అడ్డుకుని అరెస్ట్ చేయడం దుర్మార్గమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. కిషన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారో కేసీఆర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇటీవల తెలంగాణలో బీజేపీలో అధిష్ఠానం భారీ మార్పులు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించింది. రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీ కిషన్ రెడ్డికి బాధ్యతలను అప్పగించింది.
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరిలో వరద ప్రవాహం భారీగా పెరిగింది. భద్రాచలం వద్ద గోదావరి 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ రఘుమారెడ్డి, సంస్థ పరిధిలోని చీఫ్ జనరల్ మేనేజర్, సూపెరింటెండింగ్ ఇంజినీర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యుత్ సరఫరా పరిస్థితిని సమీక్షించారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే ఉభయసభలు మణిపూర్ అంశంపై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో రెండు సభలు ఆందోళనలతో అట్టుడికిపోయాయి. ఈ నేపథ్యంలో రెండు సభలు రేపటికి వాయిదా పడ్డాయి.
కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ‘ఛలో బాట సింగారం’ కార్యక్రమం తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నేడు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకున్న కిషన్ రెడ్డి బాట సింగారం బయలుదేరడంతో.. ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ రాష్టం లో గత 9 సంవత్సరాలుగా అధికారం లో వున్న బీఆర్ఎస్.. kishan reddy fires on brs. breaking news, latest news, telugu…
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యారేజులకు వరద పోటెత్తింది. కాళేశ్వరం వద్ద జలకళ సంతరించుకుంది. మహారాష్ట్ర నుంచి తరలివస్తున్న ప్రాణహిత నది వరదతో గోదావరి పోటెత్తింది. మహారాష్ట్రలో ఎగువన గడ్చిరోలి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కాళేశ్వరం వద్ద గోదావరి 10.090 మీటర్ల ఎత్తుకు నీటిమట్టం పెరిగింది.