Nedurumalli Ramkumar Reddy : జగన్ అమలు చేస్తున్న పథకాలు.. అభివృద్ధి పాలనే ప్రజా స్పందనకు నిదర్శనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల వైఎస్సార్ నేతన్న నేస్తం నిధులు లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సందర్భంగా నెల్లూరి జిల్లాలోని వెంకటగిరిలో బహిరంగ సభ నిర్వహించారు. అయితే.. దీనిపై నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. వెంకటగిరిలో నేతన్న నేస్తం కార్యక్రమం అనుకున్న దానికంటే విజయవంతమైందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి మా తండ్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి మొదట విగ్రహావిష్కరణ ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా జరగడం సంతోషమన్నారు. మా కుటుంబ సభ్యులతో పాటు నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి అభిమానుల మనసు పులకించిందని, వెంకటగిరి సభకు వచ్చిన ప్రజలను చూసి ప్రతిపక్ష పార్టీలు కూడా ఆశ్చర్యపోయాయన్నారు.
జగన్ అమలు చేస్తున్న పథకాలు..అభివృద్ధి పాలనే ప్రజా స్పందనకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. వెంకటగిరి నుంచి ఎన్నికల నగరాను జగన్ ప్రారంభించినట్టుగా చెప్పుకోవచ్చని,
నియోజకవర్గంలో ఏడు రోజుల పాటు యువగళం పాదయాత్ర చేసినా ఏడు మంది కూడా వైసీపీ నాయకులు వెళ్ళలేదని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో జిల్లాలోని పది స్థానాల్లో గెలుపొందామని, అడిగిన వెంటనే వెంకటగిరి నియోజకవర్గం పై జగన్ వరాల జల్లు కురిపించారని ఆయన అన్నారు. అల్తూరిపాడు జలాశయానికి సవరించిన అంచనాలను ఆమోదించారని, వంద సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించడం ప్రజల్లో ఆనందాన్ని నింపిందన్నారు. ముఖ్యమంత్రి మంజూరు చేసిన పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపడతామని, మాటల కంటే అభివృద్ధి పనులకే ప్రాధాన్యం ఇస్తామన్నారు. పెంచలకోనను మరింత అభివృద్ధి చేస్తామని, ఇప్పటికే 150 ఎకరాల భూమిని అటవీ శాఖ ఇచ్చిందన్నారు రామ్‌కుమార్ రెడ్డి.
Also Read
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు