ఓటర్ల జాబితా ప్రత్యేక సమ్మరీ రివిజన్ కోసం ఇంటింటికి వెళ్లి ఓటరు సర్వే శుక్రవారం విశాఖ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ప్రారంభం కానుంది. రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించి అధికారులకు సహకరించాలని, ప్రస్తుత ఓటర్లను సరిచూసేందుకు, చనిపోయిన ఓటర్లను, 100 ఏళ్లు పైబడిన ఓటర్లను, ఎన్టీఐ ఓటర్లను, ఇతరులను గుర్తించేందుకు చేపట్టే సర్వేలో పాల్గొనాలని కోరారు... breaking news, latest news, telugu news, big news, voter survey,
గత మూడు రోజులుగా కురుస్తు్న్న వర్షాలు హైదరాబాద్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. దంచి కొడుతున్న వర్షాలతోపలుచోట్ల కాలనీలు నీటమునిగాయి. మణికొండ పంచవటి కాలనీలోకి భారీగా వరద నీరు చేరింది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంచవటి కాలనీ మునిగిపోయింది.
తాను ప్రేమిస్తున్న యువతి మరో యువకుడితో సన్నిహితంగా ఉంటోందన్న నెపంతో సదరు యువకుడిని అతిదారుణంగా హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జోన్ కొత్తూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
మాజీ మంత్రి, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత చిలుకూరి రామచంద్రారెడ్డి(81) కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం అస్వస్థతకు గురికావడంతో రామచంద్రారెడ్డిని మెరుగైన చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా గురువారం గుండెపోటు రావడంతో రామచంద్రారెడ్డి తుదిశ్వాస విడిచారు.
బాడీబిల్డింగ్ ప్రపంచంలో ఆశిష్ సఖార్కర్ గురించి తెలియని వారు ఉండరు. మిస్టర్ ఇండియా నుంచి ప్రపంచవ్యాప్తంగా ఫోరమ్‌లలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్న ఆశిష్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఈ లెజెండరీ బాడీబిల్డర్ కన్నుమూశారు.
తెలంగాణ ఐటీ శాఖ కార్యక్రమాలు, పాలసీలపైన అధ్యయనం చేసేందుకు తమిళనాడు ఐటీ శాఖ మంత్రి పలనివేల్ త్యాగరాజన్ (పీటీఆర్) ఆధ్వర్యంలో ఒక బృందం రాష్ట్రానికి విచ్చేసింది. ఈ బృందం మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది.
మణిపూర్ అల్లర్లను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘణపూర్ డివిజన్ కేంద్రంలో నియోజకవర్గ స్థాయి పాస్టర్ల సమావేశంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పాల్గొని ప్రసంగించారు.