భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్ట్ను పరిశీలించారు. పోలవరం నిర్మాణ పనులపై మంత్రి ఆరా తీశారు. డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యామ్ దగ్గర వరదపై సమీక్ష చేపట్టారు.
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం తంగడంచలో 17 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ ఇంటి పెరట్లో పూలు ఉన్నాయని, వచ్చి కోసుకెళ్లమని నమ్మించి హరికుమార్ గౌడ్ అనే వ్యక్తి బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది.
‘జగనన్న సురక్ష’ కార్యక్రమం రాష్ట్రంలో రికార్డు సృష్టిస్తోంది. అర్హత ఉండి కూడా రాష్ట్రంలో ఎవరూ ప్రభుత్వ పథకాలు అందకుండా ఉండకూడదన్న మహోన్నత లక్ష్యంతో ప్రభుత్వం ‘జగనన్న సురక్షా’ కార్యక్రమాన్ని జులై 1న లాంఛనంగా ప్రారంభించింది.
పట్టుదల ఉంటే పేదరికం అనేది అడ్డుకాదని.. చదవాలనే తపన ఉంటే కుటుంబ పరిస్థితులు, వయస్సు అసలు ఆటంకమే కాదని నిరూపించింది ఓ మహిళ. లక్ష్యం జీవితాన్ని విజయపథాన నడిపిస్తుందనడానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది ఆ మహిళ. దినసరి కూలీగా ఎండనకా, వానెనకా చెమటోడుస్తూనే.. చదువుపై ఉన్న ఆసక్తితో అహోరాత్రాలూ శ్రమించింది. ఉన్నతంగా నిలబడాలన్న తపనతో ఎట్టకేలకు రసాయన శాస్త్రంలో పీహెచ్డీ సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఎన్డీఏ సమావేశంలో చర్చ జరగలేదని, దేశ రాజకీయ పరిస్థితుల గురించే ప్రధానంగా చర్చ జరిగిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎన్డీఏ పక్షాల సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన పవన్ కళ్యాణ్ సమావేశం అనంతరం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.
ప్రతికూల అవగాహనతో ఏర్పడిన పొత్తులు ఎప్పుడూ విఫలమవుతాయని ఎన్డీయే సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఢిల్లీలోని అశోక హోటల్లో మంగళవారం జరిగిన ఎన్డీయే పక్షాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్డీయేలో చేరిన కొత్త పార్టీలకు స్వాగతం పలికారు. అభివృద్ధి దిశగా దేశం ముందుకు సాగుతోందని.. అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవిస్తున్నామని మోడీ పేర్కొన్నారు.
సృజనాత్మక స్వేచ్ఛ పేరుతో భారతీయ సంస్కృతిని, సమాజాన్ని కించపరిచేలా ప్రభుత్వం అనుమతించదనిసమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం ఓటీటీ ప్రతినిధులతో అన్నారు. ఓటీటీ ప్లాట్ఫారమ్ల ప్రతినిధులతో ఇక్కడ జరిగిన సమావేశంలో అనురాగ్ ఠాకూర్ ఈ విషయం చెప్పారు.