విదేశీ యూనివర్శిటీలతో పాటు దేశీయ ప్రతిష్టాత్మక సంస్థల్లో బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో వెనుకబడిన వర్గాల ఫీజులు ప్రభుత్వం తెలంగాణ చెల్లిస్తుందని ఆయన తెలిపారు. దీంతో.. 10వేల మంది మెరికలైన తెలంగాణ బీసీ విద్యార్థులకు లబ్ది చేకూరనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి సంవత్సరం 150కోట్లకు పైగా అదనంగా బీసీ విద్యకు ప్రభుత్వం కేటాయించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Also Read : Baby: ‘బేబీ’నా మజాకా.. 11 రోజుల్లో అర్జున్ రెడ్డి కలెక్షన్స్ బ్రేక్ చేసిందిగా!
ఇప్పటికే అంతర్జాతీయంగా యూఎస్, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో చదివే బీసీ విద్యార్థులకు అందిస్తున్న ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌తో పాటు రాష్ట్రంలోనూ ఫీజు రీయెంబర్స్‌మెంట్ చెల్లిస్తున్నట్లు చెప్పారు. ఇకపై దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో చదువుతున్న వారికి సైతం ఫీజు రీయెంబర్స్‌మెంట్ అమలు చేస్తామన్నారు. దీంతో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో బీసీ విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజును చెల్లిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని మంత్రి గంగుల వెల్లడించారు. బీసీల సర్వతోముఖాభివృద్ధికి కేసీఆర్ సర్కార్ కృషి చేస్తోంది మంత్రి గంగుల వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు మంత్రి గంగుల కమలాకర్.
Also Read : Rahul Gandhi: మీరు ఎలానైనా పిలవండి.. ప్రధాని వ్యాఖ్యలకు రాహుల్ కౌంటర్