హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ తరహాలోనే డ్రగ్స్ కేసులోనూ విదేశాలకు ప్రాఫిట్ మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు. కొన్ని రోజుల క్రితం ముగ్గురు నైజీరియన్ లతో పాటు ఇద్దరు ఇండియన్స్ ని అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులు. వీరి లావాదేవీలపై దృష్టి పెట్టిన హైదరాబాద్ పోలీసులు.. డ్రగ్స్ కోసం కస్టమర్ల నుండి 4 కోట్ల రూపాయలు వసూలు చేసిన్టలు గుర్తించారు.
Also Read : Pawan Kalyan : హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కు డేట్స్ కేటాయించిన పవర్ స్టార్..?
4 కోట్ల రూపాయలను 22 విదేశీ అకౌంటులకు మళ్లించినట్టు, 22 అకౌంట్లోను హెన్రీ అనే డ్రగ్ సప్లయర్ ఆపరేట్ చేస్తున్నట్లు విచారణలో తేలింది. దీంతో.. హెన్రీ కోసం హైదరాబాద్ పోలీసుల వేట కొనసాగుతోంది. 22 బ్యాంక్ అకౌంట్స్ పరిశీలన కోసం ప్రైవేట్ ఏజెన్సీని హైదరాబాద్ పోలీసులు ఆశ్రయించారు. వీరి వద్ద నుండి 200 మంది కస్టమర్లు డ్రగ్స్ సేకరించినట్టు గుర్తించారు పోలీసులు. వీరిలో 90 శాతం బెంగళూరుకు చెందిన కస్టమర్లు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మరో 10 శాతం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కస్టమర్లు ఉన్నట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల కస్టమర్స్ గా ఉన్నవారు బెంగళూరులో చదువుకునే రోజుల్లో డ్రగ్స్ కొన్నట్టు పోలీసులు విచారణలో తేలింది.
Also Read : Minister Audimulapu Suresh: మాదిగలంతా రుణపడి ఉంటారు.. ఆ కేసుల మాఫీకి సీఎం అంగీకారం