ఆంధ్రప్రదేశ్ శాసన సభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు నిరవధిక వేయిస్తున్నట్లు ప్రకటించారు. 10 రోజులపాటు కొనసాగిన సభలో మొత్తం 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం లభించింది. మొత్తం 59 గంటల 57 నిమిషాల పాటు సభ కొనసాగింది.
ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు 'స్వర్ణాంధ్ర - 2047' డాక్యుమెంట్‌పై మాట్లాడారు. వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నినాదంతో 'స్వర్ణాంధ్ర 2047' డాక్యుమెంట్ రూపొందించామని అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారని సీఎం తెలిపారు. 2047 నాటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు అవుతుంది.. ప్రధాని మోదీ వికసిత్ భారత్ పిలుపునిచ్చారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా.. మొదటి మ్యాచ్ పెర్త్‌లో జరుగుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే ఆలౌటంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి అలెక్స్ కారీ (19), మిచెల్ స్టార్క్ (6) పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఏపీలో పింఛన్ల పంపిణీపై కొత్త మార్గదర్శకాలు ఏపీలో పింఛన్ల పంపిణీపై కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరుసగా రెండు నెలలు పింఛన్లు తీసుకోకున్నా మూడో నెలలో పింఛన్ పంపిణీ చేసేలా.. మొదటి రెండునెలలు పింఛన్ తీసుకోకున్నా మూడో నెలలో మొత్తం కలిపి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేసింది. వరుసగా మూడు నెలలు తీసుకోకుంటే శాశ్వతంగా వలస వెళ్లినట్టు భావిస్తూ పింఛన్ నిలిపివేయనున్నారు. ఈ నెల నుంచే ఈ గైడ్‌లైన్స్ అమలులోకి వచ్చాయి.…
నరసాపురం ఎంపీ, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మకు పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తండ్రి సూర్యనారాయణ రాజు (91సం.లు) గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు సాయంత్రం హైదరాబాద్ హాస్పిటల్లో ప్రాణాలు విడిచారు.
సుమత్రా తీరంలో ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రం, దక్షిణ అండమాన్ సముద్రంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో నవంబర్ 23న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.
కోటి దీపోత్సవానికి విశిష్ట అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. కోటి దీపోత్సవం వేదికగా భక్తులను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. దీపాలతో ప్రతి కార్యక్రమాన్ని ప్రారంభించడం మన సంప్రదాయమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. కోటి దీపోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
ఏపీలో పింఛన్ల పంపిణీపై కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరుసగా రెండు నెలలు పింఛన్లు తీసుకోకున్నా మూడో నెలలో పింఛన్ పంపిణీ చేసేలా.. మొదటి రెండునెలలు పింఛన్ తీసుకోకున్నా మూడో నెలలో మొత్తం కలిపి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేసింది.
అమెరికాలోనూ అదానీ అక్రమాలకు పాల్పడ్డారు.. గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు అయింది. న్యూయార్క్ జడ్జి తన ఆదేశాల్లో అరెస్టు వారెంట్ జారీ చేయడంతో.. భారత్ లో రాజకీయంగా తీవ్ర వివాదం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. గౌతమ్ అదానీ.. భారతీయ, అమెరికా చట్టాలను ఉల్లంఘించినట్లు తెలుస్తుందన్నారు. మోడీ, అదానీ కలిసి ఉంటే.. ఆ ఇద్దరూ ఇండియాలో క్షేమంగా ఉంటారని ఆయన ఆరోపించారు. అదానీని తక్షణమే అరెస్ట్ చేయాలని…