రాష్ట్రంలో శాంతి భద్రతలే కీలకమని.. టూరిజం డెవలప్ కావాలంటే శాంతి భద్రతలు పటిష్టంగా ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో అన్నారు. నాలెడ్జ్ ఎకానమీకి ఏపీ చిరునామా కావాలంటే శాంతిభద్రతలు చాలా ముఖ్యమన్నారు. పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని.. చట్టాన్ని చేతికి తీసుకుని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఎవరైనా సరే శిక్షిస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు
అనంతపురం జిల్లా నార్పలలో విషాదం చోటుచేసుకుంది. నార్పల మండల కేంద్రంలోని మెయిన్ బజార్లో ఉన్న పెద్దమ్మ సామీ గుడి వద్ద ఉన్న ఓ ఇంటిలో ఆరునెలల బాలుడితో పాటు ఉరేసుకుని దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.
ఏపీ అసెంబ్లీ పీఏసీ ఛైర్మన్ పదవికి వైసీపీ నాయకుడు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్‌ను వైసీపీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్ బలపరిచారు. పీఏసీ కమిటీలో మొత్తం 12 మంది సభ్యులకు గాను 9 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఉంటారు.
బీఆర్ఎస్ హయాంలో మహబూబాబాద్‌లో గిరిజనుల నుంచి బలవంతంగా లాక్కున్న భూములను వారికి తిరిగి ఇచ్చిన తర్వాతనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహబూబాబాద్‌కు రావాలని ఎంపీ బలరాంనాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ.. లగచర్ల ఘటన బీఆర్ఎస్ పార్టీ కుట్రతో చేయించిందని.. అందులో ఏడుగురికి భూములు లేవని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని దుయ్యబట్టారు.
నారాయణపేట జిల్లాలోని మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులెవరైనా సరే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
ఆషాడం పోయింది.. శ్రావణం కూడా వెళ్ళిపోయింది. మహారాష్ట్ర ఎన్నికలు కూడా ముగిసిపోయాయి. ఎప్పుడు? ఇంకెప్పుడు? మా ఆశలు నెరవేరేదెప్పుడు? ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్న చర్చ ఇది. అధిష్టానం పెద్దలు హామీ ఇచ్చినట్టు వెంటనే పదవుల పందేరం ఉంటుందా? ఇంకేవన్నా సాకులు తెర మీదికి వస్తాయా? గాంధీభవన్ వర్గాలు ఏమంటున్నాయి?
బీఆర్ఎస్ అధిష్టానం ఎక్కడ పోగొట్టుకున్నామో... అక్కడే వెదుక్కునే ప్రయత్నంలో ఉందా? అంటే... ఎక్కడ పోగొట్టుకున్నారో... నిజంగా పార్టీ పెద్దలకు తెలిసి వచ్చిందా? లేక తెలిసిందని అనుకుంటున్నారా? ప్రత్యేకించి ఓ వర్గం ఓటర్లు తమకు ఎందుకు పూర్తిగా దూరం అయ్యారో కనుక్కున్నారా? ఏ విషయంలో బీఆర్ఎస్ పెద్దలకు జ్ఞానోదయం అయింది? ఇప్పుడు ఏ రూపంలో ప్యాచ్ వర్క్ మొదలు పెట్టారు?
రేపు హైదరాబాద్‌లో తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు జరుగనున్నాయి. ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. సాయంత్రం 4.30 నుంచి కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. సాయంత్రం 5 గంటల తర్వాత ఫలితాలు వెల్లడి కానున్నాయి. కాగా ఈ ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వర్‌నాథ్ పోటీ పడుతున్నారు.
హైదరాబాద్‌లో జరుగుతున్న 'భక్తి టీవీ' కోటి దీపోత్సవానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా రాబోతున్నారు. గురువారం రాత్రి 7.30 గంటల నుంచి 9 గంటల వరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోటి దీపోత్సవ ప్రాంగణంలో జరిగే వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్నారు.