మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. మహాయుతీ కూటమి చారిత్రాత్మక విజయానికి ఆయన 'X' వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీ నేతృత్వాన్ని ప్రజలు నమ్మి ఇచ్చిన విజయం.. మోడీ పరివర్తనాత్మక ఆలోచనలు, వికసిత భారత్‌ను సాధించే విధానాలను ప్రజలు నమ్మారని చంద్రబాబు పేర్కొన్నారు.
చితిపై తగలబడుతుండగా స్పృహ.. ఒక్కసారిగా లేచిన యువకుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..! రాజస్థాన్‌లో ఘోర అమానుష ఘటన చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైపోయేది. పోలీసుల అప్రమత్తతతో యువకుడి ప్రాణాలు నిలబడ్డాయి. ఈ ఘటన జుంజును జిల్లాలో చోటుచేసుకుంది. రాజస్థాన్‌లోని జుంజును జిల్లాలో 25 ఏళ్ల చెవిటి, మూగ యువకుడు రోహితాష్ కుమార్ అనాథగా ఉంటున్నాడు. కుటుంబం లేకపోవడంతో ఒక షెల్టర్ హోమ్‌లో నివాసం ఉంటున్నాడు. అతడి ఆరోగ్యం బాగోలేకపోతే స్థానిక…
భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా తొలి మ్యాచ్ జరుగుతోంది. మొదటి రోజు మ్యాచ్ ఆటను ఎవరూ ఊహించలేదు. పెర్త్‌లో తొలిరోజు మొత్తం 17 వికెట్లు పడ్డాయి. 1952 తర్వాత ఆస్ట్రేలియాలో తొలిరోజు అత్యధిక వికెట్లు పడిన రికార్డు ఇదే. ఈ క్రమంలో తొలిరోజే ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. భారత ఇన్నింగ్స్ సమయంలో నాథన్ లియాన్, మార్ష్.. పంత్‌ను ఇబ్బంది పెట్టినట్లు అనిపించగా, ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో…
పల్నాడులో విషాదం చోటు చేసుకుంది. బావిలో స్నానానికి దిగి ఇద్దరు శివ మాలధారులు స్వాములు మృతి చెందారు. ఈ ఘటన వినుకొండ మండలం నడిగడ్డ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శివ మాల వేసుకున్న మొత్తం ముగ్గురు స్వాములు స్నానం చేయడం కోసమని దిగుడు బావిలోకి దిగారు. ఈ క్రమంలో స్వాములు గల్లంతు కాగా.. ప్రమాదవశాత్తు ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
గుంటూరులో ఆర్మ్డ్ రిజర్వ్ (AR) హెడ్ కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎస్కార్ట్ విధులు నిర్వహిస్తుండగా తుపాకీ పేలడంతో తలలోకి తూటా దూసుకెళ్లింది. ఈ క్రమంలో వంశీకృష్ణ అనే హెడ్ కానిస్టేబుల్.. అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు.
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణను సిట్ ప్రారంభించింది. ఉదయం తిరుపతికి సిట్ బృందం చేరుకుంది. నలుగురు డీఎస్పీ, సీఐ, ఎస్సైలతో కలిసి సిట్ బృందం తిరుపతి, తిరుమలలో పర్యటించనుంది. ఈ క్రమంలో.. తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లో తాత్కాలిక ఆఫీస్ ఏర్పాటు చేశారు. కల్తీ నెయ్యి కేసుపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి సీబీఐ డైరెక్టర్‌కు నివేదికను ఇవ్వనుంది ఈ బృందం.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్సార్ మృతి చెందిన తర్వాత జగన్ కాంగ్రెస్ విధానానికి ఎదురు తిరిగారు.. కాంగ్రెస్ విధానాల నుంచి స్వేచ్ఛగా బ్రతకాలని వైఎస్ జగన్ కాంగ్రెస్ సంకెళ్లు తెంచుకున్నారని పేర్ని నాని అన్నారు. చంద్రబాబు చీకట్లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తారని ఆరోపించారు.
ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం.. ఉక్కిరిబిక్కిరైన ప్రజలు దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత కొనసాగుతోంది. ఈరోజు (శుక్రవారం) ఉదయం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 11.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు అయింది. దీంతో రాజధాని ప్రాంతాన్ని దట్టమైన పొగమంచు పూర్తిగా కమ్మేసింది. అలాగే, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 373గా రికార్ట్ అయింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలో మొత్తం 38 మానిటరింగ్ స్టేషన్లలో తొమ్మిదింటిలో ఏక్యూఐ లెవల్స్ తీవ్రమైన కేటగిరీలో…
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో లోకాయుక్త సవరణ బిల్లును విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత లేకపోయినా లోకాయుక్త స్ఫూర్తిని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో 2024 ఎన్నికల తర్వాత కొత్త పరిస్థితులు ఏర్పడ్డాయి.. శాసనసభలో ప్రతిపక్ష నేత లేని నేపథ్యంలో లోకాయుక్త మెంబర్స్ సెలెక్షన్ కమిటీ కాంపోజిషన్స్ గురించి ఏపీ లోకాయుక్త అమెండ్మెంట్ బిల్లు ప్రవేశపెట్టామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.