లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు ఓ ప్రభుత్వ ఉద్యోగి. హైదరాబాద్‌లోని నాంపల్లి, గగన్ విహార్ 11వ అంతస్తులో ఏసీబీ అధికారులు రైడ్స్ చేపట్టారు. ఈ క్రమంలో.. మలక్‌పేట్-II సర్కిల్‌కు చెందిన కమర్షియల్ టాక్స్ అసిస్టెంట్ కమిషనర్ మహబూబ్ బాషా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. రూ. లక్ష డిమాండ్ చేసి 50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కాడు.
నల్గొండ మెడికల్ కాలేజీ హాస్టల్లో ర్యాగింగ్ పై నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ర్యాగింగ్ ఘటనపై పై పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. మీడియాలో వరస కథనాల ద్వారానే ర్యాగింగ్ విషయం తెలిసిందని నేషనల్ మెడికల్ కౌన్సిల్ లేఖలో పేర్కొంది. అసలు కాలేజీలో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఉందా లేదా అని ప్రశ్నించింది.
భారత అమ్మాయిల హాకీ జట్టు అదరగొట్టింది. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఓటమి అనేది ఎరుగకుండా టైటిల్‌ను కైవసం చేసుకుంది. బుధవారం ఫైనల్లో 1-0తో చైనాను చిత్తు చేసి ఛాంపియన్‌గా నిలిచింది. దీపిక 31వ నిమిషంలో గోల్ చేసి భారత్‌ను ఆధిక్యంలో నిలిపింది. దీంతో.. ఆసియా మహిళల ఛాంపియన్స్ ట్రోఫీని వరుసగా రెండోసారి కైవసం చేసుకుంది.
విదేశీ ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో ఎర వేస్తున్న సైబర్ నేరగాళ్లు.. అమాయక నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగం ఆశ చూపించి వారి దగ్గర సాఫ్ట్ వేర్ జాబ్ అంటూ డబ్బులు తీసుకొని విద్యార్థులు మంచిగా నటిస్తూ మెయింటైన్ చేస్తున్నారు. వారి దగ్గర నుంచి లక్షల రూపాయల వసూళ్లకు పాల్పడి భారీ మోసాలకు పాల్పడుతున్నాయి. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జయ నగర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరిట భారీ మోసానికి పాల్పడ్డారు.
హైదరాబాద్ గాంధీ భవన్లో సేవాదళ్ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. సేవాదల్ అధ్యక్షులు జితేందర్ అధ్యక్షతన ఈ ఉత్సవాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అఖిల భారత సేవాదళ్ అధ్యక్షులు లాల్జ్ జి దేశాయ్, ఎంపీ అనిల్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు కేశవ రావు, మాజీ పీసీసీ అధ్యక్షులు వి. హనుమంతరావు, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత తదితరులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం టీ20 ఆటగాళ్ల తాజా ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. దక్షిణాఫ్రికాతో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ తర్వాత భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా నెంబర్-1 స్థానంలోకి అడుగుపెట్టాడు. హార్దిక్ మరోసారి టీ20 ఆల్‌రౌండర్‌గా నంబర్‌వన్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌కు చెందిన లియామ్ లివింగ్‌స్టోన్, నేపాల్‌కు చెందిన దీపేంద్ర సింగ్ ఐరీలను వెనక్కినెట్టి నెంబర్ వన్‌కు ఎగబాకాడు. హార్దిక్ ప్రస్తుతం 244 రేటింగ్ పాయింట్లతో ఉన్నాడు.
కడప జిల్లాలోని కమలాపురం శ్రీ బాలయోగి గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి ఆత్మహత్యాయత్నం చేసింది. హాస్టల్ గదిలో గొంతు కోసుకుని విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. నొప్పితో బాధపడుతున్న విద్యార్థిని తోటి విద్యార్థులు గమనించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలలో అతిపెద్ద వస్త్ర వ్యాపార సంస్థ సి.ఎం.ఆర్ షాపింగ్ మాల్ మచిలీపట్నంలో ఘనంగా ప్రారంభమైంది. బుధవారం ఉదయం 09:42 గంటలకు గనులు, భూగర్భ శాస్త్ర మరియు ఎక్సైజ్ శాఖామాత్యులు కొల్లు రవీంద్ర సతీమణి కొల్లు నీలిమ ఘనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా.. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ రావు, మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ, కార్పొరేటర్, పలువురు నేతలు పాల్గొన్నారు.
అరండల్‌పేట పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని గుంటూరు నగర మేయర్ మనోహర్ నాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గుంటూరు నగర మేయర్ మనోహర్ నాయుడికి ఏపీ హైకోర్టు చురకలు అంటించింది.