కాలేజీ రోజులను గుర్తుచేసుకున్న ప్రధాని.. మన్‌కీ బాత్‌లో మోడీ ఏం మాట్లాడారంటే?
మహారాష్ట్రలో విజయం సాధించిన తర్వాత ప్రధాని మోడీ ఈరోజు తన నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ ద్వారా ప్రజలతో మమేకమయ్యారు. ఈ రోజు నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC) డే సందర్భంగా ఆయన తన పాఠశాల రోజులను గుర్తు చేసుకున్నారు. దేశంలోని యువత కూడా ఎన్‌సీసీలో చేరాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు జనవరి 12న వివేకానంద జయంతి సందర్భంగా భారత్ మండపంలో యువజన ఆలోచనల మహాకుంభం ఉంటుందని ప్రధాని తెలిపారు. దీనికి ‘డెవలప్డ్ ఇండియా యంగ్ లీడర్స్ డైలాగ్’ అని పేరు పెట్టినట్లు పేర్కొన్నారు. గయానా విదేశీ పర్యటనను కూడా మోడీ ప్రస్తావించారు. నేటి మన్ కీ బాత్ కార్యక్రమంలోని ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకుందాం..
నదుల అనుసంధానంపై కూడా చర్చ జరగాలని కోరాం
రేపటి నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఢిల్లీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న తెలుగు దేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. ఏపీ విభజన అంశాల్లో కొన్ని పూర్తయ్యాయు, ఇంకా కొన్ని పెండింగ్ లో ఉన్నాయన్నారు. 10 ఏళ్లుగా నెమ్మదిగా పోలవరం నిర్మాణం జరుగుతున్న తీరుతెన్నులపై పార్లమెంట్ లో చర్చ జరగాలని కోరానని, కడప స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో నెలకున్న పరిస్థితి, జాప్యానికి కారణాల పై కూడా చర్చ జరగాలని కోరానని ఆయన మీడియాకు తెలిపారు. విభజన హామీల్లో కొన్ని సంస్థలకు శాశ్వత కట్టడాలు వచ్చాయి. మరికొన్ని సంస్థలు ఏర్పాటు కావాలన్నారు లావు కృష్ణదేవరాయులు. విజయవాడ లో వరద భీభత్సం నేపథ్యం లో, దేశంలో పలు నగరాలు, పట్టణాలను వరదలు ముంచెత్తుతున్నాయని, ప్రకృతి వైపరీత్యాల పై పార్లమెంటులో విపులంగా చర్చ జరగాలని కోరానని ఆయన తెలిపారు.
అఖిలపక్ష సమావేశంలో ఏపీకి సంబంధించిన అనేక డిమాండ్లు ప్రస్తావించాం
రేపటి నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఢిల్లీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ… అఖిలపక్ష సమావేశంలో ఏపీకి సంబంధించిన అనేక డిమాండ్లు ప్రస్తావించామని, పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై రాష్ట్ర మంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారన్నారు. పోలవరం ఎత్తు ఎంత అన్నదానిపై రకరకాల ప్రశ్నలు వస్తున్నాయని, పోలవరం అంశంపై పార్లమెంట్ లో చర్చించాలన్నారు మిథున్ రెడ్డి. విభజన చట్టంలోని హామీలను ఇంకా పూర్తిగా నెరవేర్చలేదని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామన్నారు. డ్రగ్స్ తో దేశంలో యువత పెడదోవ పడుతున్నారు, నిర్వీర్యం అవుతున్నారని, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చట్టాలు తీసుకురావాలన్నారు మిథున్ రెడ్డి.
మహారాష్ట్ర సీఎం ఎవరు..? నేడు మహాయుతి కీలక సమావేశాలు..
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఏక్‌నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీల ‘‘మహాయుతి’’ కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 288 స్థానాలకు గానూ కూటమి 233 సీట్లను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి కేవలం 49 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. మహాయుతి కూటమిలో బీజేపీ ఏకంగా 132 సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీ కూటమి దాటికి ప్రతిపక్షంలోని కాంగ్రెస్, ఉద్ధవ్ సేన, శరద్ పవార్ ఎన్సీపీలకు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.
విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది
ఏపీ సీఎం చంద్రబాబు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులు చదువులు మానేసుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యార్థులపై కక్షగట్టినట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎక్స్ వేదికగా.. ‘@ncbn గారి కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. మూడు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులను పిల్లల చదువులకు చెల్లించకపోవడంతో చదువులు మానుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. చంద్రబాబుగారు వారిపై కక్షకట్టినట్టు వ్యవహరిస్తున్నారు. ఒంగోలు జిల్లా జె.పంగులూరులో ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక, ఫీజులు కట్టలేక పనులకు వెళ్తున్న విద్యార్థి కథనం నాకు ఆవేదన కలిగించింది.
పోలీస్ స్టేషన్‌కు దివ్వెల మాధురి.. జనసేన నాయకులపై ఫిర్యాదు
దివ్వెల మాధురి మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. సోషల్ మీడియాలో తనపై, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న జనసేన పార్టీ నాయకులపై దివ్వెల మాధురి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆదివారం టెక్కలి సీఐ శ్రీనివాస్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. తనపై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది. అనంతరం దివ్వెల మాధురి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆడవాళ్లపై సోషల్ మీడియా వేదిక అనుచిత వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకుంటామని చెబుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారో చూస్తామని వెల్లడించింది. ముఖ్యంగా జనసేన నేతలు తనపై చాలా అసభ్యకరంగా పోస్టులు పెట్టారని, వారిపై చర్యలు తీసుకుంటారని తాను నమ్ముతున్నట్లు తెలిపింది. ఆ పోస్టుల్ని చూసి తాను మానసికంగా చాలా వేదన అనుభవించానని, అంత జుగుప్సాకరంగా జనసేన పేరు చెప్పుకుంటూ పోస్టులు చేస్తున్నారని ఆరోపించింది. అలాగే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కూడా సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేశారని దివ్వెల మాధురి వాపోయింది. గతంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫిర్యాదు చేసిన పోలీసులు స్పందించలేదని దివ్వెల మాదిరి విమర్శించింది.
ఐపీఎల్ వేలంలో రికార్డ్స్ బ్రేక్ చేసిన శ్రేయాస్ అయ్యర్
నేడు జెడ్డా వేదికగా ప్రారంభమైన ఐపీఎల్ 2025 మెగా వేలం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాడు రికార్డ్ శ్రేయస్ అయ్యర్ ను పంజాబ్ కింగ్స్ రూ. 26.75 కోట్లు పెట్టి కైవసం చేసుకుంది. దీంతో గత సంవత్సరం ఐపీఎల్ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుబోయిన మిచెల్ స్టార్క్ రికార్డును బద్దలు కొట్టాడు. 2024 వేలంలో మిచెల్ స్టార్క్ ను కోల్కతా నైట్ రైడర్స్ రూ. 24.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక మరోవైపు మరో టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ ను 18 కోట్లకు పంజాబ్ రైట్ టు మ్యాచ్ ద్వారా చేజిక్కించుకుంది. హైదరాబాద్ అర్షదీప్ సింగ్ కోసం 18 కోట్ల వరకు ఫైనల్ బీడ్ వేయగా చివరకు పంజాబ్ రైట్ టు మ్యాచ్ ఉపయోగించి అతడిని కైవసం చేసుకుంది.
అధికారం పోయిందని బీఆర్ఎస్ నాయకులు ప్రతిరోజు కాంగ్రెస్‌పై ఏడుస్తున్నారు
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక శివారులో పత్తిపాక రిజర్వాయర్ స్థలాన్ని పరిశీలించారు మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం వచ్చి ఏడాది గడవనే లేదు అంతలోనే అల్లావుద్దీన్ అద్భుతదీపంలా పనిచేయాలని ప్రజల్లో నూరి పోస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అని ఆయన అన్నారు. అధికారం పోయిందని బీఆర్ఎస్ నాయకులు ప్రతిరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పై ఏడుస్తున్నారని, గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో నిరుద్యోగులు ఉద్యోగాలు లేక అల్లాడిపోయారన్నారు. ఏడాదిలోనే నిరుద్యోగులకు వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది అని ఆయన వ్యాఖ్యానించారు. మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని, సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వద్దని బీఆర్ఎస్ నాయకులు సంకల్ప దీక్ష చేపడతారా అని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నిర్మించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని, పది నెలల్లో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఇచ్చామన్నారు మంత్రి శ్రీధర్ బాబు.
రూ.27 కోట్లు పలికిన టీమిండియా డైనమెట్ రిషబ్ పంత్
జెడ్డా వేదికగా మొదలైన ఐపీఎల్ 2025 మెగా వేలం నువ్వా నేనా అన్నట్లుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో మొదట టీమిండియా ఆటగాడు రికార్డ్ శ్రేయస్ అయ్యర్ ను పంజాబ్ కింగ్స్ రూ. 26.75 కోట్లు పెట్టి భారీ ధరకు కైవసం చేసుకుంది. ఆ తర్వాత టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ ను రూ. 18 కోట్లకు పంజాబ్ కింగ్స్ ” రైట్ టు మ్యాచ్ ” ద్వారా చేజిక్కించుకుంది. ఇది ఇలా ఉండగా టీమిండియా డైనమెట్ రిషబ్ పంత్ ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ వేలంలో రికార్డ్ ధరకు కొనుగోలు చేసింది లక్నో సూపర్ జెయింట్స్. ఈ వేలంలో ఏకంగా రూ. 27 కోట్ల భారీ ధరకు లక్నో సూపర్ జెయింట్స్ రిషబ్ పంత్ దక్కించుకుంది. ఇప్పటి వరకు ఇదే అత్యధిక ధర ఒక ఆటగాడికి.
బాలినేని మరీ ఇంతలా దిగజారి పోతాడని ఊహించలేదు..
మాజీమంత్రి బాలినేనిపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఫైర్ అయ్యారు. విద్యుత్ ఒప్పందాలపై బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు ఎవరూ హర్షించరన్నారు. బాలినేని అబద్ధాలు మాట్లాడటం చూస్తుంటే అబద్ధాలు కూడా ఇంత గొప్పగా మాట్లాడగలరా అనిపిస్తుందా అని విమర్శించారు. 4.50 రూపాయలతో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒప్పందాలు చేసుకుంటే.. జగన్ సిఎం అయినా తర్వాత 2.48 రూపాయలకు తగ్గించారన్నారు. బాలినేని కొత్త పార్టీ వాళ్ల మెప్పు పొందటానికి ఇలా మాట్లాడి ఉండవచ్చని పేర్కొన్నారు. జగన్‌ను విమర్శిస్తే పార్టీలో మెచ్చుకుంటారు అని ఆయన దిగజారి మాట్లాడుతున్నారన్నారు. బాలినేని మరీ ఇంతలా దిగజారి పోతాడని ఊహించలేదన్నారు.. ఎమ్మెల్సీ కోసం ఇప్పటికే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని అనుకుంటున్నారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు.