ఐపీఎల్ మెగా వేలం (IPL 2025) ప్రారంభమైంది. ఆది, సోమవారాల్లో జెడ్డాలో జరుగనుంది. ఈసారి వేలంలో పలువురు స్టార్ ప్లేయర్లు పాల్గొనడంతో మెగా వేలంలో భారత ఆటగాళ్ల ఆధిపత్యం కనిపించబోతోంది. 366 మంది భారతీయులు, 208 మంది విదేశీ ఆటగాళ్లతో కూడిన ఈ మెగా వేలంలో 577 మంది ఆటగాళ్ల భవిష్యత్తు తేలనుంది.
ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ తక్కువ ధరకు అమ్ముడుపోయాడు. అతని కోసం హైదరాబాద్, పంజాబ్‌లు వేలం వేసాయి. మ్యాక్స్‌వెల్ బేస్ ధర రూ.2 కోట్లు. పంజాబ్ కింగ్స్ రూ.4.20 కోట్లకు బిడ్ చేసింది.
మిచెల్ మార్ష్ కోసం హైదరాబాద్, లక్నో పోటీ పడ్డాయి. చివరకు లక్నో సూపర్ జెయింట్స్ మార్ష్‌ను రూ.3 కోట్ల 40 లక్షలకు కొనుగోలు చేసింది.
పంజాబ్ కింగ్స్ తమ జట్టులో మార్కస్ స్టోయినీస్‌ను చేర్చుకుంది. ఆర్సీబీ, సీఎస్కే, పంజాబ్ ఈ ఆటగాడి కోసం పోటీ పడ్డాయి. చివరకు పంజాబ్ రూ.11 కోట్లకు కొనుగోలు చేసింది.
మెగా వేలంలో వెంకటేష్ అయ్యర్ సంచలనం రేపాడు. అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు. రూ. 23.75 కోట్లకు కేకేఆర్ కొనుగోలు చేసింది. వెంకటేష్ అయ్యర్ కోసం
ఆర్సీబీ, కేకేఆర్ పోటీ పడింది. చివరకు కోల్‌కతా సొంతం చేసుకుంది.
స్పిన్ మాయజాలం రవిచంద్రన్ అశ్విన్‌ను సీఎస్కే సొంతం చేసుకుంది. రూ. 9.75 కోట్లకు కొనుగోలు చేసింది. అశ్విన్ కోసం రాజస్థాన్ ఫ్రాంచైజీ పోటీ పడింది. చివరకు చెన్నైకు సొంతం అయ్యాడు.
రచిన్ రవీంద్రను సీఎస్కే సొంతం చేసుకుంది. రూ. 4 కోట్లకు కొనుగోలు చేసింది. పంజాబ్ ఫ్రాంచైజీ పోటీ పడినప్పటికీ.. ఆర్టీఎం పద్థతిలో సీఎస్కే సొంతం చేసుకుంది.
హర్షల్ పటేల్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. రూ. 8 కోట్లకు కొనుగోలు చేసింది. హర్షల్ కోసం పంజాబ్ కూడా పోటీ పడింది. చివరకు హైదరాబాద్ దక్కించుకుంది.
యువ ఆటగాడు జేక్ ఫ్రేజర్- మెక్‌గర్క్‌ను ఆర్టీఎంలో ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. రూ.9 కోట్లకు కొనుగోలు చేసింది. ఇతని కోసం పంజాబ్ ఫ్రాంచైజీ పోటీ పడింది.
పలు ఐపీఎల్ సీజన్లో అద్భుతంగా రాణించిన స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్‌ను తీసుకునేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు తీసుకురాలేదు. దీంతో అన్‌సోల్డ్ ప్లేయర్‌గా నిలిచాడు.
రాహుల్ త్రిపాఠిని చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. బేస్ ధర రూ. 75 లక్షలు ఉండగా.. సీఎస్కే, కేకేఆర్ పోటీ పడి చెన్నై రూ.3.40 కోట్లకు కొనుగోలు చేసింది.
డెవాన్ కాన్వేను చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. రూ.6.25 కోట్లకు కొనుగోలు చేసింది.
గత సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన ఐడెన్ మార్క్రమ్కు డిమాండ్ లభించలేదు. అతన్ని కొనేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. బేస్ ప్రైస్ రూ.2 కోట్లకే లక్నో సొంతం చేసుకుంది.
దేవ్‌దత్ పడిక్కల్ అన్ సోల్డ్‌గా నిలిచాడు. బేస్ ప్రైస్ రూ. 2 కోట్లకు ఎవరు కొనుగోలు చేయలేదు.
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. హ్యారీ బ్రూక్‌ను రూ.6.25 కోట్లకు ఢిల్లీ దక్కించుకుంది.
స్టార్ బ్యాట్స్‌మెన్ KL రాహుల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. రూ. 14 కోట్లకు రాహుల్‌ను సొంతం చేసుకుంది.
ఆల్ రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది. రూ.8.75 కోట్లకు ఆర్సీబీ సొంతం చేసుకుంది.
హైదరబాద్ ఆటగాడు మహమ్మద్ సిరాజ్ గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. రూ. 12.25 కోట్లకు సిరాజ్‌ను దక్కించుకుంది.
స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. రూ. 18 కోట్లకు దక్కించుకుంది.
మహ్మద్ షమీని హైదరాబాద్ కొనుగోలు చేసింది. రూ. 10 కోట్లకు ఎస్ఆర్హెచ్ దక్కించుకుంది.
సౌతాఫ్రికా డేంజరస్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్‌ను రూ.7.5 కోట్లకు లక్నో సొంతం చేసుకుంది.
రూ.27 కోట్లకు రిషబ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. దీంతో.. శ్రేయాస్ అయ్యర్ రికార్డ్‌ను పంత్ బ్రేక్ చేశాడు.
మిచెల్ స్టార్క్‌ను రూ.11.75 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.
జోస్ బట్లర్ ను రూ.15.75 కోట్లకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది.
ఐపీఎల్ చరిత్రలోనే శ్రేయాస్ అయ్యర్ అత్యధిక ధర పలికాడు. స్టార్క్ రికార్డ్ బ్రేక్ చేశాడు.. రూ.26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకున్నారు.
కగిసో రబాడను రూ. 10.75 కోట్లకు సొంతం చేసుకున్న గుజరాత్
రైట్ టు మ్యాచ్ కింద అర్ష్‌దీప్ సింగ్‌ను రూ. 18 కోట్లకు సొంతం చేసుకున్న పంజాబ్.