వైసీపీ తరఫున అఖిలపక్ష సమావేశానికి రాజ్యసభ పక్ష నేత విజయసాయిరెడ్డి, లోకసభ పక్ష నేత మిథున్ రెడ్డి హాజరయ్యారు. సమావేశం అనంతరం మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. అఖిలపక్ష సమావేశంలో ఏపీకి సంబంధించిన అనేక డిమాండ్లు ప్రస్తావించామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై రాష్ట్ర మంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు.. పోలవరం ఎత్తు ఎంత అన్నదానిపై రకరకాల ప్రశ్నలు వస్తున్నాయన్నారు. పోలవరం అంశంపై పార్లమెంట్‌లో చర్చించాలని పేర్కొన్నారు. విభజన చట్టంలోని హామీలను ఇంకా పూర్తిగా నెరవేర్చలేదు.. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు.
Read Also: Himanta Biswa Sarma: జార్ఖండ్‌లో ఎన్నికల్లో బీజేపీ పరాజయం నాకు తీవ్రమైన బాధ కలిగిస్తోంది..
డ్రగ్స్‌తో దేశంలో యువత పెడదోవ పడుతున్నారు, నిర్వీర్యం అవుతున్నారు.. డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చట్టాలు తీసుకురావాలని మిథున్ రెడ్డి అన్నారు. సోషల్ మీడియా కార్యకర్తల పై “నాన్ బెయిలబుల్” కేసులు పెడుతున్నారు.. సోషల్ మీడియా కార్యకర్తలను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ, తీవ్రంగా వేధిస్తున్నారన్నారు. ఏపీలో అధికార పార్టీకి ఒక చట్టం, ప్రతిపక్ష పార్టీకి మరోచట్టం అన్న తరహాలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. చట్టం ముందు అందరూ సమానులే.. సోషల్ మీడియా కార్యకర్తల అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తాం, చర్చకు పట్టుబడతామని తెలిపారు.
Read Also: IND vs AUS: సెంచరీ చేసిన కింగ్ కోహ్లీ.. ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసిన భారత్
ఆదానితో ఎలాంటి “సోలార్ పవర్” ఒప్పందం జరగలేదు.. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ “సెకి” (SECI) (సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)తో మాత్రమే ఒప్పందాలు జరిగాయని ఎంపీ మిథున్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ“సెకి” తో అనేక రాష్ట్రాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.. గత తమ ప్రభుత్వంపై వచ్చేవన్నీ ఆధార రహిత ఆరోపణలు అని తెలిపారు. “వక్ఫ్” బిల్లు విషయంలో మైనార్టీల పక్షాన తాము నిలబడతామని ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు.