ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఖమ్మం, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో 1324 కోట్ల రూపాయల విలువైన పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ దగ్గర ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సేవలను కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. నాడు ఎన్టీఆర్ సాధించలేకపోయినదాన్ని నేడు ఆయన శిష్యుడు కేసీఆర్ సాధ్యం చేసి చూపించబోతున్నారని కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం సత్తుపల్లిలో బీఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోరాడి తెచ్చుకున్న తెలంగాణతో రైతు కష్టాలు తొలగాయన్నారు.
Also Read : Theft of shoes: బూట్లు దొంగిలించిన దొంగ కోసం పోలీసుల గాలింపు
భారతదేశంలో ఏకైక రైతు నాయకుడు కేసీఆర్ అని ఆయన కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని పార్లమెంట్ లో రైతుల పక్షన పోరాటాలి అని కేసిఆర్ నాకు ప్రతిసారి చేప్పేవారని, గతంలో అప్పులు ఆత్మహత్యలు జరిగేవన్నారు. పోరాడి సాధించుకున్న తరువాత తెలంగాణలో రైతన్నకు పేద్దపీట వేసిన నాయకుడు కేసీఆర్ అని ఆయన అన్నారు. ప్రప్రంచ వ్యాప్తంగా పర్యటనలు చేసి కంపెనీలు పెట్టించిన నాయకుడు కేటీఆర్ అని ఆయన వ్యాఖ్యానించారు. బయట 12 రాష్ట్రల నుండి యువత వచ్చి మన తెలంగాణలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు అంటేనే అది మనం సాధించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనత అని ఆయన అన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించండని ఆయన కోరారు.
Also Read : Ayodhya idol: అయోధ్యలోని ఓ రహస్య ప్రాంతంలో తయారవుతున్న రాముడి శిల్పం