పెన్షన్ల విషయంలో చత్తీస్‌గఢ్, కర్ణాటకలో రూ.200, మధ్య ప్రదేశ్ , గుజరాత్లో రూ.600 ఇస్తున్నారని.. దివ్యాంగులకు అండగా నిలిచి రూ.4016 ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వమేనని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. మిగిలిన వారి కంటే మేము ఏ విషయంలో తక్కువ కాదు అని అన్ని సందర్భాల్లో దివ్యాంగులు నిరూపించారన్నారు. దివ్యాంగులకు చాలా మందికి వాహనాలు అందచేశామన్నారు.
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు మధ్య ప్రధాని నరేంద్ర మోడీ తిరుమలలో పర్యటించనున్నారు. ప్రధాని పర్యటనకు పటిష్ట బందోబస్తు కల్పిస్తున్నారు. భద్రతా ఏర్పాట్లలో 2 వేల మంది పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నారు. తిరుమల అంతటా భద్రత కట్టుదిట్టం చేశారు.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోసం ఈవీఎంల పరీశీలన పూర్తి అయిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. 29న పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తామని వెల్లడించారు. ఈ నెల 30న రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో హోమ్ ఓటింగ్ పూర్తి అయిందని.. లక్షా 68 వేల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఇచ్చామన్నారు.
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు. మార్పు కోసం ఓటేయడానికి సిద్ధం అయ్యారని ఆయన పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విజన్‌తోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని.. ఓఆర్ఆర్ ఆయన హయాంలోనే వచ్చిందన్నారు.
మాజీ మంత్రి పేర్ని నానిపై కొల్లు రవీంద్ర తీవ్రంగా మండిపడ్డారు. దొంగే దొంగ అన్నట్టు పేర్ని నాని తీరు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. దొంగ ఓట్లపై హైకోర్టులో కేసు నడుస్తోందన్నారు. ఆ పిల్ ప్రకారం ఆర్డీఓ, డీటీకి షోకాజ్ నోటీసులు ఇస్తే కాళ్లు పట్టుకుని అపుకున్నాడని ఆయన విమర్శించారు.
జగ్గారెడ్డిని గెలిపిస్తున్నారా లేదా అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓటర్లను అడిగారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారసభలో రాహుల్ ప్రసంగించారు. దొరల తెలంగాణకి, ప్రజల తెలంగాణ కి మధ్య పోరాటం ఇది అంటూ ఆయన అన్నారు. కేసీఆర్ ప్రజల భూములు లాక్కుంటున్నారని.. వందల కోట్లు దోచుకుంటున్నారని, కాళేశ్వరం పేరుతో ప్రజల సొమ్ము దోచుకున్నారని ఆయన ఆరోపించారు.
రోజురోజుకి పెరుగుతున్న సైబర్ మోసాలు. కారు పేరుతో తెలంగాణ వ్యక్తిని మోసం చేసారు సైబర్ మోసగాళ్ళు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.