ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి.. కానీ బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసమని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. 15 సంవత్సరాలు పోరాడి తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ అని సీఎం తెలిపారు. సంగారెడ్డిలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. ఉన్న తెలంగాణను ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో కలిపారని.. 58 ఏళ్ళు ఎన్నో గోసలు పడ్డామన్నారు.
ఎచ్చెర్లను ప్రజల కోరిక మేరకే శ్రీకాకుళం జిల్లాలో నియోజకవర్గం కొనసాగించామని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా చిలకలపాలెంలో సామాజిక సాధికార యాత్రలో మంత్రి ప్రసంగించారు. మత్స్యకారుడైన అప్పలరాజును మంత్రిని చేయడంతో బుడగట్లపాలెం, మంచినీళ్లపేటలో ఫిషింగ్ హార్బర్లు వచ్చాయన్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. బిలారీ రోడ్‌వేస్ బస్టాండ్‌లో ఉన్న చేతి పంపు నుంచి తెల్లటి పాల లాంటి నీరు బయటకు వచ్చాయి. దీంతో అక్కడి జనాలు అది చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. అంతేకాకుండా దానిని తీసుకెళ్లడానికి జనాలు ఎగబడ్డారు. ఇళ్ల నుంచి బకెట్లు, ప్లాస్టిక్ సంచులు తెచ్చుకుని ఆ పదార్థాన్ని తీసుకుపోయేందుకు పెద్ద సంఖ్యలో గూమికూడారు.
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సామాజిక న్యాయ సూత్రానికి కాంగ్రెస్ వ్యతిరేకమని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో వర్గీకరణ జరుగుతుందని ఎదురు చూసామని తెలిపారు.
విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేస్తున్న అంబేడ్కర్ స్మృతివనం, అంబేడ్కర్ విగ్రహ నిర్మాణ పనులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అంబేడ్కర్ స్మృతివనం నిర్మాణం చారిత్రాత్మకమైనదని.. ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అని మంత్రులకు, అధికారులకు వివరించారు.
విశాఖపట్నంలోని జూపార్క్‌లో ఉదయం విషాదం చోటుచేసుకుంది. జూపార్క్‌లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న నగేష్ అనే జంతు సంరక్షకుడిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఉదయం జూపార్క్ పరిసరాల్లో క్లీనింగ్ చేస్తుండగా.. అతనిపై దాడి చేయగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఎలుగుబంటి బోనులో ఉందనుకొని క్లీనింగ్ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది.
పశ్చిమ బెంగాల్‌లోని బక్సా టైగర్ రిజర్వ్ అటవీప్రాంతంలో ఈరోజు పార్శిల్ రైలు ఢీకొన్న ప్రమాదంలో మూడు ఏనుగులు చనిపోయాయి. రాజభట్ఖావా, కాల్చిని రైల్వే స్టేషన్ల మధ్య శిఖరి గేట్ సమీపంలో ఉదయం 7 గంటలకు ఈ సంఘటన జరిగింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ఉద్యమ ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో.. మీ అమ్మగారైన శ్రీమతి సోనియాగాంధీ యూపీఏ చైర్‌పర్సన్‌గా ఉండి కూడా.. దాదాపు 1200మంది ఆత్మహత్య చేసుకున్నాక గానీ.. తెలంగాణ ఇవ్వలేదు. ఇది కాకుండా.. నాడు విద్యార్థి లోకం, ఉద్యోగ, ఉపాధ్యాయసంఘాలు, తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తుంటే.. వారికి మద్దతు తెలపాల్సింది పోయి, రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన సీపీఎం, మజ్లిస్ పార్టీలతో మీరు జతకట్టారని కిషన్…