దీపం ఉన్నపుడే ఇల్లు సద్దుకోవాలి అమ్మగారు. నెలంతా కష్టపడితే గాని రాని పైసలు కేవలం ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటలు అలా వెళ్లి ఇలా వస్తే వస్తున్నాయి. కూసంత సర్దుకోండి అయ్యగారు.
Voter Slip: అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగు రోజులే టైం ఉంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ఓటర్లకు స్లిప్పుల పంపిణీ జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికే దాదాపు సగం మంది ఓటర్లకు స్లిప్పులు ఇచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ రెండు రోజుల క్రితం మీడియాకు వెల్లడించారు.
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీజేపీ పార్టీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ కు మద్దతుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం నిర్వహించారు. అందులో భాగంగా.. నిజాంపేట్ హనుమాన్ ఆలయం కూడలి వద్ద భారతీయ జనతా పార్టీ కార్నర్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుత్బుల్లాపూర్ ప్రజల ప్రేమకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు. కుత్బుల్లాపూర్ లో బలమైన నాయకుడు శ్రీశైలం గౌడ్ అని అన్నారు.
నిన్న (శుక్రవారం) మాజీ ఐఏఎస్ ఏకే గోయల్ ఇంట్లో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్, టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 22లోని ఏకే గోయల్ ఇంట్లో ఎన్నికల బృందం, టాస్క్‌ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఏకే గోయల్ మాట్లాడుతూ.. మా ఇంట్లో అక్రమ డబ్బు, మద్యం ఉన్నాయని ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేసేందుకు వచ్చారు, వారికి పూర్తిగా సహకరించానని తెలిపారు. తమ ఇంట్లో…
శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో మాదాపూర్, కూకట్ పల్లిలో వివేకానంద నగర్, హైదర్ నగర్, అల్విన్ కాలనీలో పాదయాత్ర నిర్వహించారు. హఫీజ్‌పేట్, చందానగర్ డివిజన్లలో ప్రచారంలో భాగంగా బైక్ ర్యాలీ తో పాటు రోడ్ షోతో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జేరిపాటి జైపాల్‌తో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి పాల్గొన్నారు. బాల్కొండ కాంగ్రెస్ అభ్యర్ధి ముత్యల సునిల్ రెడ్డి తరుఫున ఆమే ప్రచారం నిర్వహించారు. అందులో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ.. ఒక సైడ్ బీఆర్ఎస్ అవినీతి విజృంభిస్తుంది.. రెండో సైడ్ లో కాంగ్రెస్ పోరాడుతుందని తెలిపారు. కేసీఆర్ కి, ఆ పార్టీకి ప్రస్టేషన్ మొదలైంది.. ఓడిపోతున్నాం అని ఏదేదో మాట్లాడుతున్నారని…
కృష్ణాజిల్లా గుడివాడలోని 15వ వార్డులో రూ. 3కోట్ల 28లక్షల నిధులతో నిర్మించిన వాటర్ ట్యాంక్‌ను ఎమ్మెల్యే కొడాలి నాని, కృష్ణా జిల్లా పరిషత్ ఛైర్మన్ ఉప్పాల హారికతో కలిసి ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రారంభించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్వకుర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగిరినపుడే మన గౌరవం పెరుగుతుందని అన్నారు. బీఆర్ఎస్ నేతలు బరితెగించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇక్కడ కట్టిన సాగునీటి ప్రాజెక్టులు, రహదారుల అభివృద్ధి కాంగ్రెస్ హయాంలో జరిగిందేనని రేవంత్ తెలిపారు.