టీడీపీకి చెందిన వ్యక్తి అని ఏ పథకమైనా ఆగిందా, చంద్రబాబును అడుగుతున్నానని ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. పూర్తి చేసిన అంశాలు, అమలైన పథకాలు వదిలేసి, ఏవేవో మాట్లాడతారని ఆయన వ్యాఖ్యానించారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4 నుంచి ప్రారంభమై 22 వరకు జరగనున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి డిసెంబరు 2న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు.
భారతీయులకు మలేషియా ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. భారతీయులు ఇప్పటికే థాయ్‌లాండ్, శ్రీలంకలో వీసా ఫ్రీ ఎంట్రీని పొందుతున్నారు. ఇక నుంచి మలేషియాలో వెళ్లేందుకు వీసా అవసరం లేదని ఆ దేశ ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం ప్రకటన చేశారు.
ఆస్ట్రేలియాతో 5 టీ20 సిరీస్ లో భాగంగా.. టీమిండియా రెండో టీ20లో ఘన విజయం సాధించింది. 44 పరుగుల తేడాతో ఆసీస్ పై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ లక్ష్యా్న్ని ఆస్ట్రేలియా ముందు పెట్టింది. ఈ క్రమంలో లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది.
కూకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్‌బీ నాలుగో ఫేస్‌లో కాంగ్రెస్ పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ ప్రవీణ్ ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి కూకట్పల్లి నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఏ ఇంటికి ఓటు అడగడానికి వెళ్లినా కూడా బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారని, హారతులు పడుతున్నారని, రాష్ట్రంలో నిశ్శబ్ధ విప్లవం కాంగ్రెస్‌లో కనిపిస్తుందని, కొంతమంది మభ్యపెట్టి, భయపెట్టి, బలహీనం చేసి ఏదో సాధించాలని చూస్తున్నారని కానీ అది సాధ్యపడదన్నారు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు చేసింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్లలో ఓపెనర్లు జైస్వాల్ (53) రుతురాజ్ (58) అర్ధసెంచరీలు చేసి జట్టుకు శుభారంభాన్ని అందించారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఇషాన్ కిషన్ (52) కూడా హాఫ్ సెంచరీ చేశాడు.
రేపు సాయంత్రం హైదరాబాద్‌లో ప్రధాని మోడీ రోడ్ షోలో పాల్గొననున్నారు. రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఆర్టీసీ క్రాస్ రోడ్ నుండి కాచిగూడ చౌరస్తా వరకు సాగనున్న మోడీ రోడ్ షో కొనసాగనుంది. రేపు ఉదయం మహబూబాబాద్ బహిరంగ సభ, మధ్యాహ్నం కరీంనగర్ బహిరంగ సభల్లో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించనున్నారు.
తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు శనివారం సోదాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఉదయం మణికొండలోని ఆయన నివాసంతో పాటు తాండూరులోని ఆయన సోదరుడి ఇంటిలో తనిఖీలు చేశారు. దాదాపు ఐదు చోట్ల ఏకకాలంలో రెయిడ్ చేశారు. ఈ క్రమంలో తాండూర్ లో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐటీ దాడులకు రోహిత్ రెడ్డి భయపడేది లేదని తెలిపారు. నిన్న హైదరాబాద్ లోని…
పవన్ కళ్యాణ్ విశాఖలో 50వేల చెక్కు ఇచ్చి జగన్‌ను దూషించడం మొదలుపెట్టారని మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ గడ్డం పెరిగినా, ఫ్లైట్ లేట్ అయినా సీఎం జగన్ కారణం అంటాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి, పవన్ బీజేపీకి... ఏంటయ్యా... మీ నీచ రాజకీయాలు అంటూ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
టీ20 సిరీస్ లో భాగంగా ఇండియా-ఆస్ట్రేలియా మధ్య ఈరోజు రెండో టీ 20 మ్యాచ్ జరగనుంది. తిరువనంతపురంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ముందుగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. తొలి టీ20లో అద్భుతమైన విజయం సాధించిన టీమిండియా.. అదే జోరును కొనసాగించాలని చూస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ లో కూడా యువ ఆటగాళ్లకే టీమిండియా అవకాశం కల్పిస్తుంది. దీంతో జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగనుంది.