Hyderabad: రోజురోజుకి పెరుగుతున్న సైబర్ మోసాలు. కారు పేరుతో తెలంగాణ వ్యక్తిని మోసం చేసారు సైబర్ మోసగాళ్ళు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల లోకి వెళ్తే.. హైదరాబాద్ కి చెందిన అద్నాన్ నజీబ్ అనే వ్యక్తి www.olx.in లో అమ్మకానికి ఉన్న క్లాసిఫైడ్స్ వెబ్సైట్ హ్యుందాయ్ వెర్నాకార్ ను చూసారు. ఓఎల్ఎక్స్ ఫ్లయిదిక్ 1.6 సిఅర్డ్ డిఐ ప్రమియం వెర్నా కారు విలువ 3,50,000 వేలకే అమ్మకం.. ఆసక్తి ఉన్నవాళ్లు 8884015372 నెంబర్ సంప్రదించాలని వెబ్సైట్లో ప్రకటించారు. అది చూసిన అద్నాన్ నజీబ్ ఆ నెంబర్ కు కాల్ చేయగా అల్ హుస్సేన్ అనే వ్యక్తి తాను దుబాయ్ కి చెందిన వాడిగా పరిచయం చేసుకున్నాడు.
Read also:MLC Kavitha: నీళ్లు ఇచ్చేవాళ్లు కావాలా ..కన్నీళ్లు ఇచ్చేవాళ్లు కావాలా ?
అలానే కారు భారతదేశం లోనీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఉందని నమ్మించాడు. అనంతరం కార్గో చార్జీల పేరుతో బాధితుడు నుండి నిందితుడు తన ఎస్ బీఐ కాతా లోకి 93,200 ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. అయితే ఇంత వరకు అంత బాగానే జరిగింది. అయితే ఎన్ని రోజులు ఎదురు చూసిన కార్ డేలవరి కాకపోగా డబ్బులు పోవడంతో తాను సైబర్ మోసానికి గురైనట్లు గ్రహించిన అద్నాన్ నజీబ్ సిఐడి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగం లోకి దిగారుతెలంగాణ సీఐడీ పోలీసులు. అనంతరం సైబర్ మోసానికి పాల్పడిన నిందితుడిని నాన్ బేలబుల్ వారంటీ కింద ఢిల్లీలో అరెస్ట్ చేసిన తెలంగాణ సిఐడి పోలీసులు..హైదరాబాద్ కి తీసుకొచ్చారు.