ప్రియాంక గాంధీ సమక్షంలో అమరావతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటుకు సిద్ధం చేస్తున్నట్లు ఏపీ కాంగ్రెస్ కమిటీ వెల్లడించింది. ప్రియాంక గాంధీకి ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు లేఖ రాశారు. ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాలను బీజేపీ ప్రభుత్వం విస్మరించిందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ లో కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ... తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపై ఒక లక్ష నలభై వేల అప్పు చేశాడని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా…
వికారాబాద్ జిల్లా తాండూర్ లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొ్న్నారు. బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి నేమురు శంకర్ గౌడ్ తరపున ప్రచారం నిర్వహించారు. అనంతరం ఇంద్రచౌక్ లోని రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. జనసేన బీజేపీకి మద్దతు ఇవ్వడానికి ముఖ్య కారణం... బీసీలకు రాజ్యాధికారం ఇస్తున్నందున అని అన్నారు. బీసీలు సీఎం కావాలని తెలిపారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ వావి వరసలు లేని రాజకీయాలు చేస్తున్నారని.. పవన్ కళ్యాణ్ పీల్చే ప్రతీ శ్వాస చంద్రబాబుకి అధికారం కోసమేనని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బరిలో నిలిచిన మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ హాజరయ్యారు.
విశాఖ ఫిషింగ్ హార్బర్లో జరిగిన బోట్ల దగ్ధం కేసును విశాఖ పోలీసులు ఛేదించారు. ఘటన జరిగిన 6 రోజులకు అసలు నిందితులను విశాఖ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించనున్నారు. సుమారు 47 సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించిన అనంతరం నిందితులను గుర్తించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో విశాఖ జిల్లా టీడీపీ ముఖ్య నాయకత్వం ఆత్మీయ సమావేశం నిర్వహించింది. అరగంటకు పైగా సమావేశం జరిగింది. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ , ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు ఈ భేటీలో పాల్గొన్నారు.
రాజస్థాన్‌లోని 200 అసెంబ్లీ స్థానాల్లో 199 స్థానాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. . రాజస్థాన్ ప్రజలు మంచి నిర్ణయం తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను.. కాంగ్రెస్ పార్టీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని నేను భావిస్తున్నాను అంటూ ఆయన తెలిపారు.