కరోనా మహమ్మారి తర్వాత ఇప్పుడు మరో వ్యాధి యావత్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఈ వ్యాధి కూడా చైనా నుంచే పుట్టింది. చైనాలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న లియోనింగ్ ప్రావిన్స్‌లోని పిల్లల్లో న్యుమోనియా ముప్పు అధికమవుతుంది. పిల్లలలో ఊపిరితిత్తులలో వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు లక్షణాలు కనిపిస్తూ.. వేగంగా పెరుగుతుంది. అయితే.. చైనాలో వ్యాప్తి చెందుతున్న న్యుమోనియాపై ఎయిమ్స్ బిగ్ అప్డేట్ ఇచ్చింది.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఒక ప్రైవేట్ పాఠశాలలో జరిగిన గొడవలో 4వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని ముగ్గురు విద్యార్థులు జామెట్రీ కంపాస్‌తో 108 సార్లు దాడి చేశారు. ఈ ఘటనలో విద్యార్థికి తీవ్ర గాయాలు కాగా.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నుంచి తిరుపతి వెళ్తుండగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అస్వస్థతకు గురయ్యారు. మంగళగిరి సమీపంలో ఆయన అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. దీంతో తొలుత ఆయనను విజయవాడలోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.
రేపు (మంగళవారం) ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. న్యూఢిల్లీలోని తన నివాసంలో సమావేశం జరుగుతుందని వర్గాలు తెలిపాయి. సాయంత్రం 6 గంటలకు జరగనున్న.. మంత్రి మండలి సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహిస్తారు.
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ గ్రౌండ్స్‌లో ఎన్టీవీ- భక్టి టీవీ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం వైభవంగా జరుగుతోంది. భక్తి టీవీ కోటి దీపోత్సవానికి విశిష్ఠ అతిథిగా ప్రధాని మోడీ హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీకి న రచన టెలివిజన్ గ్రూప్ డైరెక్టర్ రచన చౌదరి స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోడీకి వేదపండితులు ఆశీర్వచనం అందించారు.
బీహార్‌లోని ఔరంగాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నలుగురు స్నేహితులు కలిసి విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం హరిహరగంజ్ కు తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం.. ఔరంగాబాద్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే.. వారి పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. మళ్లీ అక్కడి నుండి గయాలోని మగద్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు రిఫర్ చేశారు. ఇక్కడ చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా,…
2.5 కోట్ల రైతు కుటుంబాల జీవితాలతో కాంగ్రెస్ చెలగాటం ఆడుతోందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయ లబ్ధి తప్ప కాంగ్రెస్ పార్టీకి ఏమీ పట్టవన్నారు. నాడు తెలంగాణను ఎండబెట్టి సర్వనాశనం చేసిందన్నారు. నేడు తెచ్చుకున్న తెలంగాణను ఆగం చేయాలని చూస్తున్నదని.. తాత్కాలికంగా కాంగ్రెస్ రైతుబంధును అడ్డుకోగలదేమో .. డిసెంబరు 3 తర్వాత అడ్డుకోలేదన్నారు.
తన సొంత ఇలాకాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. సోమవారం కొడంగల్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ విజయభేరి సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ కొడంగల్ నాకు అస్థిత్వాన్ని ఇచ్చింది.. పోరాటాన్ని నేర్పింది అని అన్నారు. 20 ఏండ్లు రైతులు, విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన పోరాడానని తెలిపారు. ఈ కొడంగల్ గడ్డ... నా అడ్డా.. మీ బిడ్డ.. మీరు నాటిన మొక్క... రాష్ట్రానికి నాయకత్వం…
తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ లో రోడ్ షోలో పాల్గొన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ నుండి కాచిగూడ చౌరస్తా వరకు మోదీ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. బీజేపీ కార్యకర్తలు, జనాలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రోడ్ షో జరుగుతున్నంత సేపు.. మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. 45 నిమిషాలు పాటు ఈ రోడ్ షో సాగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుండి కాచిగూడ చౌరస్తా వరకు 2.5…