మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఒక ప్రైవేట్ పాఠశాలలో జరిగిన గొడవలో 4వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని ముగ్గురు విద్యార్థులు జామెట్రీ కంపాస్‌తో 108 సార్లు దాడి చేశారు. ఈ ఘటనలో విద్యార్థికి తీవ్ర గాయాలు కాగా.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సిడబ్ల్యుసి) పోలీసుల నుండి విచారణ నివేదికను కోరింది.
Read Also: Chelluboina Venugopal: మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌కు అస్వస్థత
ఈ ఘటన నవంబర్ 24న జరిగినట్లు సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ పల్లవి పోర్వాల్ తెలిపారు. ఈ ఘటన అత్యంత భయంకరమని.. ఇంత చిన్న వయస్సులో ఉన్న పిల్లలు హింసాత్మకంగా ప్రవర్తించడానికి గల కారణాలను తెలుసుకోవడానికి మేము పోలీసుల నుండి దర్యాప్తు నివేదికను కోరాము, ”అని ఆమె చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించి పిల్లలు, వారి కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇస్తుందని.. పిల్లలు హింసాత్మక దృశ్యాలను కలిగి ఉన్న వీడియో గేమ్‌లు ఆడుతున్నారో లేదో కనుగొంటారని పోర్వాల్ పేర్కొన్నారు.
Read Also: Mahesh Babu: మహేష్ సింప్లిసిటీ.. అంత పెద్ద ఈవెంట్ కు ఆ డ్రెస్ లో
అయితే ఈ విషయం తెలుసుకున్న బాలుడి తండ్రి భయాందోళనలకు గురయ్యాడని తెలిపాడు. “నా కొడుకు ఇంటికి వచ్చి జరిగిన ప్రమాదాన్ని గురించి వివరించాడు. తోటి విద్యార్థులు ఎందుకు ఇలా పాల్పడ్డారో తెలియదు. పాఠశాల యాజమాన్యం తరగతి గదిలోని సీసీటీవీ ఫుటేజీని తనకు ఇవ్వడం లేదు ”అని బాలుడి తండ్రి చెప్పాడు. మరోవైపు.. ఈ ఘటనపై ఏరోడ్రోమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ విషయంపై సమాచారం తెలిశాక విద్యార్థికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వివేక్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటనలో పాల్గొన్న చిన్నారులందరూ 10 ఏళ్ల లోపు వారేనని, చట్టపరమైన నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.