10th Exam Schedule: విద్యార్థులకు అలర్ట్.. పదో తరగతి పరీక్షల పూర్తి షెడ్యూల్ ఇదే..!
- పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల
- మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు
- గణితం 23న, సైన్స్ 25 & 28న
- విద్యార్థుల కోసం కీలక సూచనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి విద్యార్థులకు కీలక సమాచారం. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ 2026 మార్చిలో నిర్వహించనున్న ఎస్ఎస్‌సీ (SSC), ఓఎస్ఎస్‌సీ (OSSC) , వొకేషనల్ పబ్లిక్ పరీక్షల సమగ్ర షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ పరీక్షలు 2026 మార్చి 16వ తేదీన ప్రారంభమై, ఏప్రిల్ 1వ తేదీ వరకు కొనసాగనున్నాయి. విద్యార్థులు తమ ప్రిపరేషన్‌ను వేగవంతం చేసేందుకు వీలుగా ప్రభుత్వం ముందస్తుగానే ఈ టైమ్ టేబుల్‌ను ప్రకటించింది.
పరీక్షలన్నీ ఉదయం 09:30 గంటలకు ప్రారంభమవుతాయి. మెజారిటీ ప్రధాన పరీక్షలు మధ్యాహ్నం 12:45 గంటల వరకు జరుగుతాయి. షెడ్యూల్ ప్రకారం మార్చి 16న ఫస్ట్ లాంగ్వేజ్‌తో పరీక్షలు మొదలవుతాయి. ఆ తర్వాత మార్చి 18న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 20న ఇంగ్లీష్ పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులకు అత్యంత కీలకమైన గణిత పరీక్ష మార్చి 23న జరగనుంది. సైన్స్ విభాగంలో ఫిజికల్ సైన్స్ పరీక్షను మార్చి 25న, బయోలాజికల్ సైన్స్ పరీక్షను మార్చి 28న నిర్వహించేలా బోర్డు ఏర్పాట్లు చేసింది. సోషల్ స్టడీస్ పరీక్ష మార్చి 30న జరుగుతుంది.
Also Read
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
- MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
- Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
RRB Group D: రైల్వేలో 22,000 గ్రూప్ డి పోస్టులు.. కొత్త అప్లికేషన్ డేట్ ఇదే
ప్రధాన సబ్జెక్టుల అనంతరం, మార్చి 31న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-II , ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-I పరీక్షలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 1వ తేదీన ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-IIతో పాటు ఎస్ఎస్‌సీ వొకేషనల్ కోర్సు థియరీ పరీక్షలతో ఈ పబ్లిక్ పరీక్షల పర్వం ముగుస్తుంది. సైన్స్ పరీక్షలు, వొకేషనల్ కోర్సుల వంటి కొన్ని నిర్దిష్ట పేపర్లకు మాత్రం ముగింపు సమయం మధ్యాహ్నం 11:15 లేదా 11:30 గంటల వరకు మాత్రమే ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
పరీక్షల నిర్వహణపై విద్యా బోర్డు కొన్ని కీలక సూచనలు చేసింది. అకడమిక్ కోర్సులకు సంబంధించిన సబ్జెక్టులు ఎస్ఎస్‌సీ , ఓఎస్ఎస్‌సీ విద్యార్థులకు ఉమ్మడిగా ఉంటాయని పేర్కొంది. ఈ పరీక్షల షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెలవుల జాబితా-2026కు లోబడి ఉంటుంది. పరీక్షా సమయంలో విద్యార్థులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, తమకు కేటాయించిన సరైన ప్రశ్నపత్రాన్నే అడిగి తీసుకోవాలని బోర్డు హెచ్చరించింది.
పొరపాటున తప్పుడు ప్రశ్నపత్రానికి సమాధానాలు రాస్తే, వారి ఫలితాలను రద్దు చేసే అవకాశం ఉంటుందని, ఆ బాధ్యత విద్యార్థులదేనని అధికారులు తేల్చి చెప్పారు. ఈ షెడ్యూల్‌ను ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ అధికారికంగా ధ్రువీకరించారు. విద్యార్థులు నిర్ణీత సమయానికి ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకుని పరీక్షలు రాయాలని సూచించారు.
PM Modi: ప్రధాని, సీఎంగా కాకుండా.. అలా ఉండటానికి గొప్ప గర్వంగా ఉంటుంది
తాజావార్తలు
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!